ఇక ఇండస్ట్రీలో ఉండను.. సొంతూరికి వెళ్లిపోతున్నా: శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు!

sivaji-raja-sensational-comments, newsxpress.online
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీ చేసి సీనియర్ నరేశ్ చేతిలో ఓటమి పాలైన మరో నటుడు శివాజీ రాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతోమంది ఒత్తిడి చేస్తేనే తాను ఈ ఎన్నికల్లో నిలబడ్డానని, అటువంటి తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఇక తాను ఇండస్ట్రీలో ఉండనని, భార్యతో కలిసి సొంతూరికి వెళ్లిపోతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  నటుడు శ్రీకాంత్, దర్శకుడు ఎస్వీ  కృష్ణారెడ్డి వంటివారు తన కోసం ఎంతో కష్టపడ్డారని, వారి కష్టాన్ని తలచుకుంటే గుండె తరుక్కుపోతోందని ఆయన అన్నారు.
 
తాను ఎవరినీ విమర్శించాలనుకోవడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకుండానే మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.

‘‘అవి నిజమని నమ్ముతారనే మీడియా ముందుకు…’’

నరేశ్ ప్యానల్ తనపై ఎన్నో విమర్శలు చేసిందని, వాటిని ఖండించకుంటే నిజమని నమ్మే అవకాశం ఉందని భావించే మీడియా ముందుకు వచ్చినట్టు శివాజీ రాజా చెప్పుకొచ్చారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, అలా చేయాల్సిన అవసరం కూడా తనకు లేదన్నారు.
 
ఎన్నికల సమయంలో  అసోసియేషన్ వ్యవహారాలపై ఎవరూ మీడియా ముందు మాట్లాడరాదన్న నిబంధనను ఉల్లఘించి మరీ నరేశ్ ప్యానల్ మీడియాకెక్కిందని శివాజీ రాజా ఆరోపించారు.