
అమరావతి: ఏపీ సీఎం జగన్ చదువుపై గతంలో ఎన్నో సందర్భాలలో చర్చ జరిగింది. జగన్ ఇంటర్మీడియట్ వరకు బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదివారనే విషయం అందరికి తెలుసు, కానీ ఆ తరువాత ఎక్కడ చదివారు అనేది ఎవరికీ తెలియదు. కానీ , జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో గతంలో కలిసి చదువుకున్న అనేకమంది తెరపైకి వచ్చారు. దీనితో , జగన్ నిజమైన విద్యార్హతలు వేలులోకి వచ్చాయి.
చదవండి: రోజాకు జగన్ ఫోన్ కాల్! జగన్ ఏంచెప్పాడో తెలుసా?
జగన్ ప్రగతి మహా విద్యాలయాలో డిగ్రీలో చేరారు. కామర్స్ ప్రధాన సబ్జెక్ట్‌గా మూడేళ్ల డిగ్రీని ఆయన అక్కడే పూర్తి చేశారు. బిజినెస్ ఎకనమిక్స్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టాటిస్టిక్స్, బ్యాంకింగ్, బిజినెస్ ఆర్గనైజింగ్ మేనేజ్‌మెంట్, సైన్స్ అండ్ సివిలైజేషన్‌లల్లో ఆయన తన డిగ్రీని పూర్తి చేశారు.
కమర్షియల్ అండ్ ఇండియన్ లా, కంపెనీ లా అండ్ ఆడిట్, కాస్ట్ అకౌంటెన్సీ, ఇన్‌కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్‌లల్లో వైఎస్ జగన్‌కు మంచి పట్టుఉంది. తన మూడేళ్ల డిగ్రీని ఆయన ఫస్ట్‌క్లాస్‌తో పూర్తి చేశారు. మొత్తం 740 మార్కులను ఆయన సాధించారు. మార్కుల జాబితాను 1994 జూన్ 17వ తేదీన జారీ చేశారు.









