రాహుల్‌-చంద్రబాబు భేటీ: మహాకూటమి సీట్ల సర్దుబాటుపైనా చర్చ…

chandrababu rahul
- Advertisement -

chandrababu rahul

న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీ‌తో గురువారం మద్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.  దేశంలో బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటుతో పాటు తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది.

దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీల కూటమి ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.  రాహుల్‌తో సమావేశం సమయంలో చంద్రబాబు వెంట టీడీపీ ఎంపీలు జయదేవ్, సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్, కంభంపాటి రామ్మోహన్ రావు ఉన్నారు. అలాగే రాహుల్ తరపున కొప్పుల రాజు, అహ్మద్ పటేల్ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం.

ఈ సమావేశంలో రాహుల్-చంద్రబాబు తెలంగాణ ఎన్నికల గురించి కూడా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీయేతర పార్టీలతో కూటమి ఏర్పాటు విషయంలో.. ఇతర పార్టీలతో కూడా చర్చించే విషయాన్ని శరద్ పవార్‌.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అప్పగించినట్లు సమాచారం.

- Advertisement -