23.8 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ నాది పాదయత్ర.. జగన్‌ది విలాసయాత్ర! కేసీఆర్‌తో లాలూచీకి ఇదే నిదర్శనం: చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు

నాది పాదయత్ర.. జగన్‌ది విలాసయాత్ర! కేసీఆర్‌తో లాలూచీకి ఇదే నిదర్శనం: చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు

chandrababu-ys jagan
- Advertisement -

jagan-chandrababu

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. తాను ఇంటికి వెళ్లకుండా 208 రోజులు పాదయాత్ర చేశానని చెప్పిన చంద్రబాబు.. జగన్ చేపట్టింది పాదయాత్రే కాదని.. అదో విలాస యాత్ర అని ఎద్దేవా చేశారు. పాదయాత్ర పవిత్రతను జగన్ దెబ్బతీశారని దుయ్యబట్టారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెబుతుండటమే వారి లాలూచీకి నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై జగన్ ఏనాడూ మాట్లాడలేదని అన్నారు. ప్రధాని మోడీకి భయపడేవాడు ఏపీకి న్యాయం చేస్తాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఓట్ల కోసమే అగ్రవర్ణ రిజర్వేషన్లు..

ఓట్ల కోసమే ప్రధాని మోడీ అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ బిల్లు తెచ్చారని చంద్రబాబు ఆరోపించారు. కాపులు, ముస్లింల రిజర్వేషన్ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు.

జనవరి 18న ఎన్టీఆర్ 23వ వర్ధంతి నిర్వహణపై నేడు సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం విజయవంతమైందని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

 

- Advertisement -