26.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఏపీ పేరెత్తాలంటే కేసీఆర్ వణికిపోవాలి: జగన్ పార్టీపై బాబు తీవ్ర విమర్శలు

ఎన్నికల తర్వాత ఏపీ పేరెత్తాలంటే కేసీఆర్ వణికిపోవాలి: జగన్ పార్టీపై బాబు తీవ్ర విమర్శలు

cbn-jagan-kcr
- Advertisement -

చిత్తూరు: ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సత్యవేడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కేసీఆర్ సెక్రటేరియట్‌కు వెళ్లడు.. జగన్ అసెంబ్లీకి రాడు అంటూ ఎద్దేవా చేశారు.

రాష్ట్రాన్ని దిగజార్చడానికి కొందరు ద్రోహులు హైదరాబాద్‌లో ఉండే కుట్రలు చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. కేసీఆర్ కుట్రదారుడు అయితే.. జగన్ పాత్రధారుడు అని విమర్శించారు. ఇప్పటికే లక్షకోట్ల దోపిడీ చేసి, పోర్టును కూడా లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక వీళ్లిద్దరికీ మోడీ పెద్ద కాపలాదారు అని, మోడీకి ఏ టీమ్ టీఆర్ఎస్ అయితే.. బీ టీమ్ వైసీపీ అని అన్నారు.

కేసీఆర్ వణికిపోవాలి..

వైసీపీ గురించి చెప్పాల్సి వస్తే ఆ పార్టీలో అందరూ రౌడీలు, దగాకోరులే కనిపిస్తున్నారని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ వివేకాను హత్య చేసింది కుటుంబసభ్యులే అయితే తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే శాంతి భద్రతలు క్షీణిస్తాయని, ఆడబిడ్డలు బయట తిరగలేని పరిస్థితి వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తనకు కుప్పం ఎలాగో సత్యవేడు కూడా అలాగేనని, ఇక్కడ కూడా 75వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా గల్లంతు చేయాలని అన్నారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న కేసీఆర్‌పై కసి తీర్చుకునేందుకు టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల తర్వాత ఏపీ పేరెత్తాలంటే కేసీఆర్ వణికిపోవాలని చంద్రబాబు అన్నారు.

చదవండి:బీజేపీలోకి జయప్రద!: ఎవరిపై పోటీగా అంటే..?

- Advertisement -