
అమరావతి: రాజకీయాల్లో ఒకోసారి కొన్ని ఊహించని విశేషాలు చోటు చేసుకుంటాయి. ఇక ఆ విశేషాలు చూడటానికి కూడా అద్భుతంగానే ఉంటాయి. ఇప్పుడు అలాంటి విశేషమే ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది.
ఒకప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు తీసుకున్న బాలుడు…నేడు వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నాడు.
1995లో ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు…అప్పుడు వచ్చిన 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. అప్పట్లో అప్పలరాజు అనే విద్యార్థి మూడవ ర్యాంకులో నిలిచాడు.
అతనికి కూడా చంద్రబాబు తన చేతుల మీదుగా అవార్డు అందజేశారు. ఇక అప్పుడు చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు తీసుకున్న బాలుడే… నేడు ఎమ్మెల్యే అయ్యాడు. అది కూడా చంద్రబాబు ప్రత్యర్ధి పార్టీ వైసీపీ నుంచి.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అప్పలరాజు పలాస నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి..టీడీపీ అభ్యర్ధి గౌతు శిరీషపై విజయం సాధించారు. ఇక నాడు చంద్రబాబుతో అవార్డు తీసుకుంటున్న అప్పలరాజు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.








