
- Advertisement -
అమరావతి: రాజమండ్రిలో సామూహిక అత్యాచారానికి గురైన దళిత బాలికను దత్తత తీసుకోనున్నట్టు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
బాధితురాలికి తెలుగుదేశం పార్టీ తరపున తక్షణమే 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని పార్టీ నేతలను ఆదేశించారు.
ఈ ఘటనపై చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీ వేశారు. కమిటీ సభ్యులు బుధవారం రాజమండ్రి వెళ్లి బాధితురాలని పరామర్శించారు. అనంతరం నివేదికను చంద్రబాబుకు అందించారు.
బాలిక పదో తరగతి వరకు చదువుకున్నట్టు పార్టీ అధినేతకు నేతలు తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, బాలికను దత్తత తీసుకుని చదివిస్తామని చెప్పారు.
టీడీపీ అండగా ఉంటుందనే భరోసాను ఆమెకు కలిగించాలని అన్నారు. ఇలాంటి దుర్మార్గాలపై పోరాడే వీరవనితగా ఆమెను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
- Advertisement -








