

తిరుపతి: ఏపీలో ఇప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకి మరికొద్ది రోజులలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో అన్ని పార్టీలుకూడా ఇప్పటికే ప్రచారాలని ప్రారంభించి ప్రజలపై వరాలజల్లు కురిపిస్తున్నారు. ఇక పొతే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ బుధవారం ఎన్నికల శంఖారావం పూరించి మొట్టమొదటగా చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో భూతుకమిటీ సభ్యులతో భారీ భహిరంగ సమావేశం నిర్వహించాడు.
ఓట్లకోసమే జగన్ ఆలా చెప్తున్నాడు..
ఇందులో భాగంగా జగన్ సీఎం చంద్రబాబు పై నిప్పులు చెరిగాడు. గత నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఎన్నికలు సమీపిస్తున్న వేల ఓట్ల కోసం అపద్దపు హామీలిస్తున్నారు అని, వాటిని నమ్మకండి అంటూ పిలుపునిచ్చాడు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… “ఆర్థిక నేరాలకు పాల్పడి, జైలుకు వెళ్లి, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైఎస్ జగన్ ను రాష్ట్రంలోని ఏ మహిళా అన్నగా అంగీకరించదని ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, జగన్ కు ఓ నేరస్థుడు ఎలా ఉంటాడో తెలుసే తప్ప, అన్న ఎలా ఉండాలన్న సంగతి తెలియదని..”చెప్పుకొచ్చాడు.
ఇంకా ..” అన్నగా ఎలా ఉండాలో అసలు జగన్ కు తెలుసా? అని ప్రశించాడు. వృద్ధాప్య పింఛన్లను రూ. 3 వేల వరకూ పెంచుతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా మాట్లాడాడు , ఓ సిద్ధాంతం లేని వ్యక్తి ఇస్తున్న తప్పుడు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని దగ్గర చేసిందని అన్నారు. ప్రతిపక్షం ప్రజలను ప్రలోభ పెట్టాలని చూస్తోందని, వారు ఎన్ని ప్రకటనలు చేసినా నష్టం లేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకి సూచించారు.
సంబంధిత వార్తలు : సమర శంఖారావంలో జగన్ వరాలజల్లు! అనుకున్నట్టే పింఛన్ 3 వేలు చేసిన జగన్!
చంద్రబాబే దళారుల కెప్టెన్! నా జీవితం ప్రజాసేవకే: ‘అన్నపిలుపు’లో జగన్








