27.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఆ మూడు సూత్రాలని పెట్టుకుని పనిచేస్తుంది: చంద్రబాబు

వైసీపీ ఆ మూడు సూత్రాలని పెట్టుకుని పనిచేస్తుంది: చంద్రబాబు

Chandrababu Naidu Latest News, YS Jagan Updates, AP Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత…ఈరోజు నుంచి అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలకాంశలపై టీడీఎల్పీ చర్చిచింది.

ఈ సందర్భంగా ప్రస్తుత వైసీపీ వైఖరి వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదముందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహనాలోపం, చెప్పుడు మాటలు వినడం, టీడీపీపై బురద చల్లడం… వైసీపీ ఈ  మూడు స్రూత్రాలను పెట్టుకుని పని చేస్తుందని అన్నారు.

పోలవరం మొదలుకొని రాజధాని వరకూ ప్రతి అంశంలో ఇదే ధోరణి కనిపిస్తోందని,  వైఎస్‌ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను తాము ప్రాధాన్య క్రమంలో పూర్తి చేశామని,  కొన్ని చివరి దశకు చేరాయని,  వాటిని ఇప్పుడు నిలిపి వేస్తున్నారని పేర్కొన్నారు.

ఇక గత ప్రభుత్వం అమలు చేసిన రుణ మాఫీ పథకం నాలుగు, ఐదు వాయిదాల మొత్తాన్ని తక్షణం రైతులకు విడుదల చేయాలని తెలుగుదేశం శాసనసభా పక్షం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అలాగే పెట్టుబడి సాయాన్ని ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అమలు చేయాలని కోరారు.

అటు రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులని ఖండిస్తూ…నాయకులు కార్యకర్తలకు అండగా ఉండాలని కోరారు.

చదవండి: మూడేళ్లలో కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తాం: ఎంపీ అవినాష్
- Advertisement -