
అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు దగ్గరపడుతున్న వేళ అభ్యర్థులతోపాటు రాజకీయ పార్టీల అధినేతలు కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు.
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమ తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు.
చంద్రబాబు నాయుడు ఆస్తులు: రూ. 20కోట్లు
సీఎం చంద్రబాబు నాయుడు తరపున శుక్రవారం కుప్పంలో నామినేషన్ దాఖలైంది. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలిలా ఉన్నాయి..
చంద్రబాబు పేరిట ఉన్న మొత్తం ఆస్తులు: రూ. రూ.20,44,33,814
– చరాస్తులు: రూ.47,38,067
– స్థిరాస్తులు: రూ.19,96,95,474
– అప్పులు: రూ.5,24,96,605 (ఇందులో లోకేష్ కోసం రూ.8,89,088)
– 2017-18లో ఆదాయపన్ను శాఖకు చూపించిన ఆదాయం: రూ.64,73,208
– మోటారువాహనం: అంబాసిడర్ కారు (ఏపీ09జీ 0393). దీని విలువ రూ.2,22,500
స్థిరాస్తి వివరాలు:
-హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్డునెంబరు 65లో 1225 చ.గజాల స్థలంలో 14,950 చ.అడుగుల విస్తీర్ణంలో భవనం. ఈ స్థలాన్ని 1985లో రూ.1,76,000తో కొన్నారు. ఆ తర్వాత దీనిపై రూ.7,99,59,988 పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం భవనం విలువ రూ.19,55,01,474.
చిత్తూరు జిల్లా నారావారిపల్లె పంచాయతీ శేషాపురంలోని సర్వేనెంబరు 214/3లో 0.97 ఎకరాల్లో 3,950 చ.అడుగుల విస్తీర్ణంలో ఇల్లు. దీనికి రూ.23,84,462 వెచ్చించారు. ప్రస్తుతం దీని విలువ: రూ.41,94,000. సొంతంగా కొనుగోలు చేసిన ఆస్తుల విలువ: రూ.19,55,01,474. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తుల విలువ: రూ.41,94,000.
అప్పుల వివరాలు
– బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకేష్‌తో కలిసి (50 శాతం): రూ.5,16,07,517 అప్పు
– ఎన్.లోకేష్‌కు: రూ.8,89,088 రుణం.
భువనేశ్వరి పేరుతో ఉన్న ఆస్తులు
– మొత్తం ఆస్తి: రూ.648,13,17,434
– స్థిరాస్తి మొత్తం: 74,29,00,000
– చరాస్తులు: రూ.573,84,17,434
– 2017-18లో భువనేశ్వరి పేరుతో చూపించిన ఆదాయం: రూ.13,45,30,513
– సొంతంగా సంపాదించిన ఆస్తి విలువ: రూ.74,29,00,000
చరాస్తి వివరాలు
– బంగారం: రూ.1,12,36,167 విలువ చేసే 3,519 గ్రాములు.
– రూ.89,44,500 విలువ చేసే 445 క్యారెట్ల విలువైన రాళ్లు ముత్యాలు
– రూ.17,43,051 విలువైన 42.41 కిలోల వెండి
– హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లో ఉన్న షేర్లు 1,06,61,652. ఒక్కో షేరు విలువ రూ.511.90. ప్రస్తుతం వీటి మొత్తం విలువ రూ.545,76,99,659.
– నిర్వాణ హోర్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో పెట్టుబడులు: రూ.3,28,80,000
– మెగాబిడ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్‌లో పెట్టుబడి: రూ.22,49,900.
– స్థిరాస్తి మొత్తం: రూ.74,29,00,000
– వ్యవసాయ భూములు: రంగారెడ్డి జిల్లా మదీనాగూడలోని సర్వేనెంబరు 51లో 2004లో రూ.73,80,100తో ఐదెకరాల భూమి కొనుగోలు. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ రూ.45,00,00,000
– వ్యవసాయేతర భూములు: తమిళనాడులోని కాంచీపురం జిల్లా సెన్నేరుకుప్పంలో 2.33 ఎకరాల్లో 50వేల చ.అడుగుల విస్తీర్ణంలో భవనం. దీన్ని 1996, 1999లో కొనుగోలు చేశారు. అప్పట్లో దీని విలువ రూ.8,66,162. ఆ తర్వాత భవనాన్ని అభివృద్ధి చేసేందుకు మరో రూ.1,77,66,854 వెచ్చించారు. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ రూ.29,29,00,000.
అప్పులు..
– మొత్తం చెల్లించాల్సిన అప్పులు: రూ.10,07,98,182
– బ్యాంక్ ఆఫ్ బరోడా(ఓవర్ డ్రాఫ్ట్)లో అప్పు: రూ.3,48,71,222
– ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌కు రెంటల్ అడ్వాన్స్ కింద: రూ.38,01,600
– ఎల్‌సీసీ నుంచి రెంటల్ అడ్వాన్స్: రూ.14,40,000
– ఎన్.లోకేష్ నుంచి: రూ.5,70,05,870
– రెడ్‌హిల్స్ లాజిస్టిక్స్ నుంచి: రూ.22,22,063
– ఇతరుల నుంచి తీసుకున్నది: రూ.14,57,419
కేసులు..
– పెండింగ్ కేసులు: 1 (ఎఫ్‌ఐఆర్ నెంబరు: 67/2010)
– కేసు వివరాలు: మహారాష్ట్రలోని బాబ్లీ డ్యాం సందర్శన సందర్భంగా ధర్మాబాద్ కోర్టు పరిధిలో నమోదైంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, అప్పుల వివరాలు:
– స్థూల ఆస్తుల విలువ రూ.339.89 కోట్లు
– జగన్ చేతిలో ఉన్న నగదు రూ.43,560
– వైఎస్ భారతి చేతిలో ఉన్న నగదు రూ.49,390
బ్యాంకుల్లో డిపాజిట్లు, పెట్టుబడులు: జగన్‌కు బెంగళూరులోని ఓరియంటల్ బ్యాంకుఆఫ్ కామర్స్‌లో రూ.20,20,083, మరో ఖాతాలో రూ.1,25,32,855, హైదరాబాద్ సచివాలయం ఎస్‌బీఐలో రూ.21,44,746, మల్కాజిగిరి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ.25వేలు ఉన్నాయి.
– వైఎస్ భారతికి బెంగళూరు బసవేశ్వరనగర్‌లోని యాక్సిస్ బ్యాంకు ఖాతాలో రూ.9,69,686, మరో ఖాతాలో రూ.17,41,087. కోరమంగళలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో రూ.5,73,701, మరో ఖాతాలో రూ.20,90,821 ఉన్నట్టు వెల్లడి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓబీసీ బ్యాంకులో రూ.8.09,884, పులివెందుల ఎస్‌బీఐలో రూ.21,37,480 ఉన్నట్లు చూపించారు. యాక్సిస్ బ్యాంకు ట్రావెల్ కార్డు కింద రూ.1,09.500గా పేర్కొన్నారు.
జగన్, భారతి పెట్టుబడులు: జగన్‌కు భారతి సిమెంట్స్‌తో సహా 13 కంపెనీల్లో పెట్టుబడులు, ఈక్విటీ షేర్లు మొత్తం ఉన్నాయి.. వీటి విలువ రూ.317,45,99,618గా పేర్కొన్నారు. భారతికి వివిధ కంపెనీల్లో పెట్టుబడులు, షేర్లు రూ.62,35,01,849 ఉన్నట్లు చూపారు.
2007లో బీఎండబ్ల్యూ ఎక్స్5, 2009లో మూడు స్కార్పియోలు రిజిస్ట్రేషన్ అయినట్లు చూపారు. ఈ నాలుగు వాహనాల కొనుగోలుకు తాను ఎలాంటి పెట్టుబడి పెట్టలేదని, తన పేరుతో రిజిస్ట్రేషన్ మాత్రమే అయిందని వివరించారు. ఇటీవలే గుంటూరు జిల్లా తాడేపల్లిలో గృహప్రవేశం చేసిన ఇంటికి సంబంధించిన వివరాలను మాత్రం అఫిడవిట్‌లో తెలిపారు. రూ.1,19,21,202 అప్పున్నట్లు కనబరిచారు. ఇందులో ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం రూ.5,80,584 అని చూపారు. ఇవేగాక వివాదంలో ఉన్న అప్పులు తన పేరిట రూ.66 కోట్లు,
తన భార్య పేరిట రూ.6.75కోట్లు ఉన్నట్లు తెలిపారు.
జగన్ పేరిట ఇడుపులపాయలో రూ.42.44లక్షల విలువ 42.44 ఎకరాల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయేతర భూమి కింద పులివెందుల మండలం భాకరాపురంలో రెండు వేర్వేరు సర్వేనెంబర్లలో రూ.8,42,39,232 విలువ 4,51,282 చదరపు గజాల స్థలం చూపించారు. బంజారాహిల్స్ రోడ్‌నెం.2లో రూ.14,46,33,560 విలువ వాణిజ్య భవనం ఉండగా, సాగర్‌సొసైటీలో, పులివెందుల మండలంలోని భాకరాపురంలో రూ.11,99,59,582 విలువ నివాసిత భవనాలు రెండు ఉన్నట్టు చూపించారు.
వైఎస్ భారతి పేరుతో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో తొమ్మిదెకరాలు, ఉడిపి జిల్లాలో 37సెంట్లు, పులివెందుల మండలంలోనే మొత్తం 10 చోట్ల రూ.7,17,41,262 విలువైన వ్యవసాయేతర భూమి. పులివెందుల, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గంలో రూ.10,25,45,015 విలువైన వాణిజ్య భవనాలున్నాయి. పులివెందులలో నివాసగృహంతోపాటు గుంటూరు జిల్లా తాడేపల్లిలో రూ.13,89,51,648 మార్కెట్ విలువజేసే రెండు విల్లాలు ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, స్థిరాస్తుల విషయంలో హైదరాబాద్ లోటస్‌పాండ్, బెంగళూరులోని ఇళ్లకు సంబంధించిన వివరాలను పొందుపరచలేదు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆస్తులు, అప్పుల వివరాలు:
స్థిరాస్తుల మొత్తం విలువ: రూ. 40.81 కోట్లు
అప్పులు రూ. 33.72 కోట్లు
చరాస్తుల విలువ: రూ.12 కోట్లు
2016-17లో ఆదాయం: రూ.15,28,71,589
2017-18లో ఆదాయం: రూ. 9,50,14,927
అడ్వాన్స్ ట్యాక్స్ రూ. 60,17,967 చెల్లింపు
– రూ. 72.95 లక్షల మెర్సిడస్ బెంజ్ ఆర్ క్లాస్ కారు, రూ. 21.50 లక్షల ఫార్చూనర్ కారు, రూ. 27.67 లక్షల స్కోడాకారు, రూ. 13.82 లక్షల మహీంద్రా స్కార్పియో, రూ.1.06 కోట్ల విలువైన వోల్వో ఎక్స్.సి.90 కారు, రూ. 32.66 లక్షల విలువైన హార్లే డేవిడ్‌సన్ వాహనం ఉన్నాయని పేర్కొన్నారు.
పవన్ భార్య పేరు మీద ఉన్న చరాస్తుల విలువ రూ. 30.50 లక్షలు. శంకరపల్లి మండలం జన్‌వాడ గ్రామంలో మూడు ప్రాంతాల్లో 18 ఎకరాల పొలం, ఆరుచోట్ల వ్యవసాయేతర స్థలాలు, నివాస భవనం ఒకటి చొప్పున ఉన్నాయి. భార్యకు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో సింగిల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్ ఉంది. భార్య పేరిట ఉన్న స్థిరాస్తుల విలువ రూ.40 లక్షలు. తనపై నలుగురు ఆధారపడి ఉన్నట్లు చూపారు. వారిలో ఇద్దరికి రూ.కోటి చొప్పున డిపాజిట్లు, ఒకరికి రూ. 29.58 లక్షల డిపాజిట్ చూపారు.
పవన్ పేర్కొన్న అప్పుల వివరాలు:
– పవన్ తీసుకుకున్న రుణాలు: రూ.33,72,65,361
– హెచ్‌డీఎఫ్‌సీ నుంచి రూ. 9.82 కోట్లు
– ఇండస్‌ఇండ్ బ్యాంక్ నుంచి రూ. 68.63 లక్షలు
– హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఓడీ రూ.2.10 కోట్లు
– దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి రూ. 2.40 కోట్లు
– హారిక – హాసిని క్రియేషన్స్ నుంచి రుణం రూ. 1.25 కోట్లు
– వదిన సురేఖ నుంచి రూ. 1.07 కోట్లు
– ఎం.ప్రవీణ్‌కుమార్ నుంచి రూ.3 కోట్లు
– ఎం.వి.ఆర్.ఎస్.ప్రసాద్ నుంచి రూ.2 కోట్లు
– బాలాజీ సినీ మీడియా నుంచి రూ. 2 కోట్లు
– శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర నుంచి రూ. 27.55 లక్షలు
– వై.నవీన్‌కుమార్ నుంచి రూ. 5.50 కోట్లు
– చెల్లించాల్సిన ఇతర మొత్తాలు రూ. 3.60 కోట్లు.








