
- Advertisement -

విశాఖ: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం నుంచి తీపి కబురు అందింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు కేంద్రం ఎట్టకేలకు అంగీకారం తెలిపింది.
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం ప్రకటన చేశారు. కొత్త రైల్వే జోన్‌కు సౌత్ కోస్ట్ రైల్వేగా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు.
విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో ఈ జోన్ ఏర్పాటువుతుంది. మిగిలిన కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేస్తామని గోయల్ వెల్లడించారు. కాగా, ఇటీవలే విశాఖకు రైల్వే జోన్ విషయంలో కేంద్రమంత్రులను బీజేపీ నేతలు కలవగా, ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా లేఖ రాశారు.
- Advertisement -








