34.3 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home ఎన్ఆర్ఐ అమెరికా ‘చిగురుపాటి’ హత్య కేసు : వీడిన మిస్టరీ.. రాకేష్‌రెడ్డిని హంతకుడిగా తేల్చిన పోలీసులు!

‘చిగురుపాటి’ హత్య కేసు : వీడిన మిస్టరీ.. రాకేష్‌రెడ్డిని హంతకుడిగా తేల్చిన పోలీసులు!

jayarammudder mistary reveld
- Advertisement -

jayarammudder mistary reveld

ప్రముఖ పారిశ్రామికవేత్త , ఎక్స్ ప్రెస్ టీవీ డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ హత్య కేసులో రాకేష్‌రెడ్డిని హంతకుడిగా పోలీసులు నిర్ధారించారు. కిరాయి హంతకులతో జయరాంను హత్య చేసినట్లు తేల్చేసారు. హైదరాబాద్‌లో కృష్ణా జిల్లా వాసులైన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. జయరాంను హైదరాబాద్‌లోనే చంపేసి మృతదేహాన్ని కంచికచర్ల వద్ద పడేసినట్లు చెప్పారు.

హత్యకి కారణం అప్పే..

రాకేష్‌రెడ్డి వద్ద తీసుకున్న రూ.4.5కోట్ల అప్పే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి, రెండు రోజులుగా నిరంతరంగా దర్యాప్తు చేపట్టారు. సెల్‌సిగ్నల్స్ ఆధారంగా కేసు మిస్టరీని చేధించారు. జయరాంను హైదరాబాద్‌లోనే హత్య చేసి, ఆపై మృతదేహాన్ని కృష్ణాజిల్లా కంచికచర్లకు తీసుకువచ్చారు.

ఆ తరువాత జయరాం తలకు బలమైన గాయమైనట్లు చిత్రీకరించేందుకు బీర్‌ బాటిల్‌తో తలపగులగొట్టి, కారులోని వెనుక సీట్లో మృతదేహాన్ని ఉంచి కారును పక్కకు నెట్టేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సాయంత్రం పోలీసులు మీడియాకు వెల్లడించనున్నారు. అమెరికా నుంచి జయరాం కుటుంబసభ్యులు నగరానికి చేరుకున్నట్టు తెలుస్తోంది.

చదవండి : చిగురుపాటి హత్య కేసు: హైదరాబాద్‌లోనే హత్య, కారులో ఓ యువతి కూడా.. అసలేం జరిగింది? 

- Advertisement -