28.5 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకి మైండ్ బ్లోయింగ్ షాక్! వైసీపీలోకి ఆ కీలక నటి!

చంద్రబాబుకి మైండ్ బ్లోయింగ్ షాక్! వైసీపీలోకి ఆ కీలక నటి!

chandrababuki sack
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. 2009 ఎన్నికలకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కారణంగా ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. సికింద్రాబాద్ నుంచి పోటీచేసి గెలుపొందారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మూడేళ్ల క్రితం 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమెకు పార్టీ అధినేత చంద్రబాబు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. తెలుగు వారందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో తాను టీడీపీలో చేరినట్లు అప్పుడు ఆమె తెలిపారు. హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చింది చంద్రబాబేనని ప్రశంసించారు.

జగన్ సమక్షంలో వైసీపీలోకి…

కానీ తాజాగా ఆమె అనూహ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.జయసుధ గురువారం సాయంత్రం వైసీపీ అధినేత వైయస్ జగన్‌ను కలవనున్నారని తెలుస్తోంది. జగన్ సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఉమ్మడి ఏపీలో జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు.

ఆమె రాజకీయ ఆరంగేట్రం, టిక్కెట్ విషయంలో నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కీలకంగా పని చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత రెండేళ్లకు ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఆమె టీడీపీ చేరినప్పటికీ, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనలేదు.ఆమె తెలంగాణలోని సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పని చేశారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ, 2014లో ఓడిపోయారు.

ఆమె తెలంగాణ నాయకురాలిగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు వైసీపీలో చేరుతున్నందున ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని భావించవచ్చు. అలాగే నంద్యాల ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా టీడీపీ ని వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. నంద్యాల ఎమ్మెల్యే టికెట్ విషయంలో చంద్రబాబు తో విబేధాల కారణంగా పార్టీ ని వీడబోతున్నాడు అని సమాచారం. చూడాలి మరి ముందు ముందు ఇంకెన్ని జరుగుతాయో..

సంబంధిత వార్తలు :

టీడీపీకి గుడ్ బై చెప్పనున్న మరో కీలకనేత! ఎన్నికల ముందు బాబుకి కష్టాలు!
కడప జిల్లా తాజా సర్వే ! అధిపత్యమా…అవమానమా చూడండి!
ఏపీలో వైసీపీ-టీడీపీల సొంత సర్వే! ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే…
టీడీపీని హడలెత్తిస్తున్న గుంటూరు జిల్లా తాజా సర్వే! ఎవరికెన్ని సీట్లో చూడండి!

- Advertisement -