21.7 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు బిగ్ షాక్! వైసీపీలో చేరిన ఎన్టీఆర్ మామ!? జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యం అంటూ…

చంద్రబాబుకు బిగ్ షాక్! వైసీపీలో చేరిన ఎన్టీఆర్ మామ!? జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యం అంటూ…

- Advertisement -

narne srinivas

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగేలా షాక్‌లు మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు టీడీపీ నేతలు వరుసపెట్టి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. పార్టీపరంగా ఆ షాక్‌ నుంచి తేరుకోకముందే మరోవైపు బంధువర్గం నుంచి కూడా చంద్రబాబుకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి.

ఇప్పటికే ఎన్టీ రామారావు పెద్దల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిన్న వైఎస్సార్ సీపీలో చేరారు. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ మామయ్య (లక్ష్మీప్రణతి తండ్రి) నార్నే శ్రీనివాసరావు గురువారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

జగన్‌ని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం..

ఈ సందర్భంగా నార్నే శ్రీనివాసరావు మాట్లాడుతూ..” ఏపీలో చంద్రబాబు పాలన సరిగా లేదు. వైఎస్‌ జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే పార్టీలో చేరాను. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో నాకు పదేళ్ల నుంచి అనుబంధం ఉంది. నేను వైఎస్సార్ సీపీలో చేరడానికి… జూనియర్‌ ఎన్టీఆర్‌కు సంబంధం లేదు…’’ అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు, ‘‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. అయితే వైఎస్సార్సీపీ గెలుపునకు మాత్రం నా వంతు కృషి చేస్తాను. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే నా లక్ష్యం..” అని నార్నే శ్రీనివాసరావు తెలిపారు.

చదవండి: జగన్ గృహ ప్రవేశం పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

- Advertisement -