23.4 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ పోలింగ్ జరగకముందే వైసీపీ తరపున గెలిచిన మొదటి ఎమ్మెల్యే..

పోలింగ్ జరగకముందే వైసీపీ తరపున గెలిచిన మొదటి ఎమ్మెల్యే..

YCP Latest News, Latest Election News, Latest AP Political News, Newsxpressonline
- Advertisement -

ఏపీలో పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సమయంలో చంద్రబాబు కి ఒక పెద్ద షాక్ తగిలింది. ఎన్నికల పోలింగ్ కూడా ముగియముందే టీడీపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి విజయం దాదాపు ఖరారైంది. చంద్రబాబునాయుడు చేసిన ఓ పిచ్చిపని వల్ల పెద్దగా పోటీ లేకుండానే ఓ అసెంబ్లీ నియోజకవర్గం వైసిపి ఖాతాలో పడబోతోంది.

ఎందుకంటే, సదరు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధి వేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీనితో ఇక్కడ వైసిపి విజయం చాలా తేలికైపోయింది. చంద్రబాబు తీసుకున్న అనాలోచిత నిర్ణయమే పార్టీ కొంపముంచిదని పార్టీ నేతలు బాధపడిపోతున్నారు.

విజయనగరం జిల్లాలో కురుపాం ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గముంది. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం వైసిపి ఎంఎల్ఏ పుష్ప శ్రీ వాణి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గట్టి అభ్యర్ధి అనుకుని జనార్ధన్ ధాట్రాజును చంద్రబాబు ఏరికోరి ఎంపిక చేశారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలవాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే, అభ్యర్ధి మాత్రం నామినేషన్ దశలోనే వెనుదిరిగాడు. అసలు కారణం ఏంటి అంటే .. ధాట్రాజు అసలు ఎస్టీనే కాదట.

అభ్యర్ధిని నిలబెట్టేటపుడు అతను ఎస్టీనా, కాదా, అనే విషయాన్ని కూడా చంద్రబాబు సరిచూసుకోకపోవటమే ఇప్పుడు టీడీపీ కొంప ముంచింది. ఇదే ధాట్రాజుపై 2012లోనే ఇదే విషయమై కేసు నమోదైంది. కేసును విచారించిన కోర్టు ధాట్రాజు అసలు ఎస్టీనే కాదంటూ తీర్పునిచ్చింది. ఆ తీర్పు వచ్చింది 2016లోనే అనే విషయాన్ని ఒక సీఎం మరచిపోవడం ఇప్పుడు అందరిని షాక్ కి గురిచేస్తుంది.

2016లో ఎస్టీ కానీ ధాట్రాజు 2019కి ఎస్టీ ఎలా అయిపోతారా.. ఇంత చిన్న లాజిక్ కూడా చంద్రబాబు ఆలోచించకపోవటమే విచిత్రంగా ఉంది. పోటి చేయాలన్న ఉద్దేశ్యంతో నేతలు తమగురించి వంద మాటలు చెబుతారు. అవన్నీ నిజమా, కాదా, అని సరి చూసుకోవాల్సింది అధినేతే. ఎస్టీ కాదు అనే అంశమే ఇపుడు కూడా సమస్యగా మారింది. ప్రత్యర్ధులు కోర్టు తీర్పును చూపించిన తర్వాత రిటర్నింగ్ అధికారికి మాట్లాడటానికి ఏమీ లేక ధాట్రాజు నామినేషన్ ను కొట్టేశారు. పోటీలో బలమైన టిడిపి పోటీ లేకపోవటంతో వైసిపి ఇక్కడ దాదాపు విజయం సాధించేసినట్లే.

చదవండి: మళ్ళీ దొరికిన నారా లోకేష్ …ఇక మారవా

- Advertisement -