22.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఇది ప్రజాస్వామ్య యుగం.. ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటించాల్సిందే: స్పీకర్

ఇది ప్రజాస్వామ్య యుగం.. ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటించాల్సిందే: స్పీకర్

- Advertisement -

అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే సభాపతిని చైర్ వద్దకు తీసుకెళ్లే సాంప్రదాయాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాటించలేదని అధికార వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. దీంతో ప్రతివిమర్శకు దిగింది టీడీపీ. దీంతో సభలో మాటల యుద్ధంతో గందరగోళం నెలకొంది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.

చదవండి: అదరహో ప్రభాస్… సాహో టీజర్ పై జక్కన్న కాంప్లిమెంట్స్

అయితే సభలో జరిగిన అంశంపై మీడియా స్పీకర్ తమ్మినేని ప్రశ్నించగా.. చాలా సున్నితంగా స్పందించారు. ఇదేముందండి.. టీ కప్పులో తుఫాన్ లాంటిది అని బదులిచ్చారు.

స్సీకర్ గా ఆధిపత్యం చలాయిస్తారా అన్న ప్రశ్నకు.. అలాంటి రోజులు పోయాయన్నారు. ఇది రాజుల యుగం కాదని.. ప్రజాస్వామ్య యుగం అని అందుకు అనుగుణంగా ప్రతీ సభ్యుడు నడుచుకోవాలన్నారు.

దీనిపై ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని .. అప్పుడే వారికో అవగాహన వస్తుందన్నారు.

- Advertisement -