అదరహో ప్రభాస్… సాహో టీజర్ పై జక్కన్న కాంప్లిమెంట్స్

6:38 pm, Thu, 13 June 19
Prabhas Latest News, Sahoo Movie Latest News, Rajamouli Latest News, Newsxpressonline

యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ సాహో టీజర్ పై ప్రశంసలు వెల్లువెత్తున్నాయ్. ముందుగా అనుకున్నట్లుగానే సాహో టీజర్ సోషల్ మీడియాలో అదరగొడుతుండగా… బాహుబలి దర్శకుడు రాజమౌళి దీనిపై స్పందించాడు. యూవీ క్రియేషన్స్ పెట్టిన భారీ ఖర్చుకు .. దర్శకుడు సుజిత్ పూర్తిగా న్యాయం చేశారని కొనియాడారు.

చదవండి: దాసరి తనయుడి అదృశ్యం.. గతంలోనూ కిడ్నాప్ అయిన ప్రభు

సోషల్ మీడియా వేదికగా స్పందించిన జక్కన్న… సాహో టీజర్ అదిరిపోయిందని ట్వీట్ చేశాడు. టీజర్ టెర్రిఫిక్ గా ఉందని… ప్రభాస్ సత్తా టీజర్ లో కనిపిస్తోందని ప్రశంసించాడు. బాహుబలి చాలా అందంగా, మనోహరంగా కనిపించాడని కాంప్లిమెంట్ ఇచ్చాడు.

అఫ్ కోర్స్ డార్లింగ్ బిరుదుకు 100 శాతం న్యాయం చేశాడన్నారు. సినిమా సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాని తెలిపారు జక్కన్న.

ఇక సాహో టీజర్ రిలీజ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం మాటల్లో వర్ణించలేనంతంగా ఉంది. కొడితే రికార్డ్ లు బద్దలు అవ్వాల్సిందేనని… రికార్డ్ బ్రేక్ చేయాలంటే తరాలు పట్టాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.