
- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యాలయాలకు ఏ పార్టీ రంగులు ఉండరాదని హై కోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వెంటనే రంగులు తొలగించాలని ఆదేశించింది. ఈ బాధ్యతను రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకోవాలని హైకోర్టు సూచించింది.
చదవండి: ఏపీ అసెంబ్లీ సంచలన నిర్ణయం.. శాసనమండలి రద్దు తీర్మానానికి ఆమోదం
ఏపీలో పంచాయతీ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. పంచాయతీ కార్యాలయాలకు ఏ పార్టీ గుర్తులు ఉండరాదని తేల్చిచెప్పిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.
- Advertisement -








