22.7 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయండి: ఏపీ హైకోర్టు కీలక తీర్పు…

ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయండి: ఏపీ హైకోర్టు కీలక తీర్పు…

ap-high-court-on-vizag-lg-polymers
- Advertisement -

అమరావతి: విశాఖపట్నం జిల్లా ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీకి సంబంధించిన రసాయన వాయువు లీకేజి ఘటన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

గ్యాస్ లీకేజి దుర్ఘటనను సుమోటోగా తీసుకున్న హైకోర్టు తాజాగా విచారణ జరిపి, ఈ మేరకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసు విచారణలో ఎల్జీ పాలిమర్స్, రాష్ట్ర ప్రభుత్వం తరుపున న్యాయవాదులు హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. 

‘‘స్టైరీన్‌ను ఎవరి అనుమతితో అక్కడ్నించి తరలించారు..’’

ఈ సందర్భంగా.. లాక్‌డౌన్ అనంతరం ఎవరి అనుమతితో కంపెనీని ప్రారంభించారని న్యాయస్థానం ప్రశ్నించింది. దుర్ఘటన తరువాత స్టైరీన్‌ను ఎవరి అనుమతితో అక్కడ్నించి తరలించారని కూడా ప్రశ్నించింది.

కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేసి ఉంచాలని, కంపెనీలోకి ఎవరినీ అనుమతించరాదని పేర్కొంది.

అంతేకాదు, కంపెనీ డైరెక్టర్లు వారి పాస్‌పోర్టులను స్వాధీనపరచాలని, అనుమతి లేకుండా డైరెక్టర్లు ఎవరూ దేశం విడిచి వెళ్లరాదని కూడా ఆదేశాల్లో పేర్కొంది.

అలాగే పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఇటు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమన్యానికి, అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -