
- Advertisement -
అమరావతి: ఏపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణను అధికారికంగా ప్రారంభించింది. పాక్షిక న్యాయ విభాగమైన రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్, సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలిస్తూ శుక్రవారం అర్ధరాత్రి సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
న్యాయ సంబంధిత కార్యాలయాలన్నీంటినీ కర్నూలులో పెడతామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. పాలనా సౌలభ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడి సచివాలయం కేంద్రంగా పనిచేస్తున్నాయి. పరిపాలన పరమైన కారణాల వల్ల వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం.. వాటికి అవసరమైన భవనాలను ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్, కర్నూలు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -








