
- Advertisement -
తెలుగుదేశం నేత, మాజీ లోక్ సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లూ రాయపాటికి కల్పించిన గన్ మెన్లను పోలీసులు తొలగించారు.
ఇటీవల మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతను సైతం ఏపీ ప్రభుత్వం కుదించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండగా, తాజాగా ఆయన వాహనానికి పైలెట్ క్లియరెన్స్ వాహనంతో పాటు ఎస్కార్ట్ కారును తొలగించారు.
తాజాగా రాయపాటికి కూడా గన్ మెన్లను తప్పించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం తమ నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కాగా, తన గన్ మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించడంపై రాయపాటి సాంబశివరావు ఇంతవరకూ స్పందించలేదు.
చదవండి: ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి తప్పిన ప్రమాదం
- Advertisement -








