

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన శనివారం ఓ లేఖ రాశారు.
జగన్పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని చంద్రబాబు లేఖలో మండిపడ్డారు. జగన్పై దాడి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు సరికాదని వ్యాఖ్యానించారు.
ఇలాగేనా మీ వ్యవహారం?
కేంద్రం వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చంద్రబాబు 5 పేజీల లేఖను ప్రధాని మోడీకి రాశారు. అంతేగాక, 2008లో ఎన్ఐఏ చట్టాన్ని మోడీ వ్యతిరేకించారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడదే చట్టాన్ని అనుసరిస్తూ జగన్పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించారని విమర్శించారు.
ఎన్ఐఏ చట్టంపై నరేంద్ర మోడీ ద్వంద్వ విధానం అవలంభిస్తున్నారని ఆరోపించారు. విదేశీ శక్తుల ప్రమేయం ఉండే కేసులను మాత్రమే జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అన్నారు. వ్యక్తిగత దాడి కేసును కూడా ఎన్ఐఏకు అప్పగించడం సరికాదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
కాగా, జగన్పై విశాఖవిమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడి చేసి గాయపర్చిన విషయం తెలిసిందే. అతను ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల ఈ కేసు విచారణను కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించిన నేపథ్యంలో చంద్రబాబు శనివారం ప్రధాని మోడీకి లేఖ గమనార్హం.
సంబంధిత వార్తలు
ఇలాగేనా మోడీ?: జగన్పై కత్తి దాడి కేసుపై చంద్రబాబు ఆగ్రహం, లేఖలో ఇలా..








