26.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలలో సమ్మెపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యుత్ సంస్థలలో సమ్మెపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ట్రాన్స్‌కోతోపాటు విద్యుత్ సంస్థల్లో సమ్మెలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ సంస్థలో ఆరు నెలలపాటు సమ్మెలు నిషేధిస్తన్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీఈపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ ఉత్తర్వుల్లోని నిబంధనలు వర్తిస్తాయి.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది.

ఇటీవల వైద్య, ఆరోగ్య రంగంలో సమ్మెలను నిషేధిస్తూ ఎస్మా చట్టం ప్రయోగించిన ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ సంస్థలపై అలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

అత్యవసర సర్వీసు ఉద్యోగులంతా రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తున్నారు. అయితే అలాంటిది ఇలా సమ్మెలు జారీ చేయడం మీద విమర్శలు వస్తున్నాయి. 

- Advertisement -