అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. కరోనా దెబ్బకు జనం బెంబేలెత్తిపోతున్నారు. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 65 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు పట్టణాలు, నగరాలకే పరిమితమైన మహమ్మారి ఇప్పుడు గ్రామాలకు సైతం విస్తరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.
గత 24 గంటల్లో ఏకంగా 6,045 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖపట్టణం జిల్లాలో అత్యధికంగా 1,049 కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 325, చిత్తూరు 345, తూర్పు గోదావరి 891, గుంటూరు 842, కడప 229, కృష్ణా 151, కర్నూలు 678, నెల్లూరు 327, ప్రకాశం 177, శ్రీకాకుళం 252, విజయనగరం 107, పశ్చిమగోదావరి జిల్లాలో 672 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 64,713కి పెరిగింది.
గత 24 గంటల్లో కరోనాతో మొత్తం 65 మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో 15, కృష్ణలో 10, పశ్చిమగోదావరిలో 8, తూర్పుగోదావరిలో 7, చిత్తూరులో 5, కర్నూలులో 5, విజయనగరంలో 4, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 3, కడప, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 823కి చేరింది.
#COVIDUpdates: 22/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 61,818 పాజిటివ్ కేసు లకు గాను
*29,390 మంది డిశ్చార్జ్ కాగా
*823 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 31,605#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ZAIJedU2ZY— ArogyaAndhra (@ArogyaAndhra) July 22, 2020