
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మారుస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టనున్న మెట్రో ప్రాజెక్టుల సౌలభ్యం కోసమే పేరు మార్చినట్టు ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది.
విశాఖపట్టణంలో తలపెట్టిన మెట్రోకు కూడా అమరావతి పేరే ఉండడంతోనే ప్రాజెక్టు పేరును మార్చినట్టు వివరించింది.
అంతేకాదు గతంలో నాగపూర్ మెట్రో ప్రాజెక్ట్ పేరును మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్పు చేసినట్లు జీవోలో ప్రభుత్వం ప్రస్తావించింది.
లక్నో మెట్రో ప్రాజెక్ట్ పేరును ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్చారని చెబుతోంది. గత ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టే ప్రయత్నాలు ప్రారంభించింది.
అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో.. అమరావతి, విజయవాడ, విశాఖలో మెట్రో నిర్మాణం చేపట్టాలని భావించింది.
డీపీఆర్‌పై కసరత్తు చేసింది.. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టింది.








