23.5 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీలో జగనే రావాలి! శత్రుశేషం ఉంచొద్దు అంటున్న ప్రముఖ నటి !

ఏపీలో జగనే రావాలి! శత్రుశేషం ఉంచొద్దు అంటున్న ప్రముఖ నటి !

- Advertisement -

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసి నేటికీ సరిగ్గా నెల రోజులు పూర్తి అయ్యింది. మరో 13 రోజుల్లో ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి. విజయం పై ఎవరి లెక్కల్లో వాళ్లు ఉండగా, అధికారంలోకి వై ఎస్ జగన్ వచ్చి అందరి లెక్కలు తేల్చాలంటోంది ప్రముఖ వివాదాస్పద నటి శ్రీరెడ్డి.

పొలిటికల్ అయినా సినిమా అయినా అగ్గిరాజేయడాన్నే అలవాటుగా చేసుకుని పాపులారిటీ కోసం సోషల్ మీడియాని హీటెక్కించే శ్రీరెడ్డి , ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ వర్గాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

జగన్ ఫొటోని షేర్ చేస్తూ మీరు రావాలి, అందరి లెక్కలు సరి చేయాలి. కావాలి జగన్, రావాలి జగన్ ఎవ్వరి శత్రుశేషం ఉంచొద్దు అంటూ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.

ఇక అంతకు ముందు కూడా జగన్‌కి అనుకూలంగా పలు పోస్ట్‌లు వదిలింది శ్రీరెడ్డి. ఎన్నికలు ముగిసిన తరువాత రాష్ట్రానికి కొత్త నాయకుడు వస్తే మరింత ఉపయోగం ఉంటుందని చాలా మంది జగన్ వైపు మొగ్గు చూపుతున్నారంటూ అభిప్రాయ పడింది.

jagan

చంద్రబాబు పాలనలో చాలా మంది విసిగిపోయిన వారు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లు జగన్‌కి కలిసి వస్తున్నాయి. ఆయన చేసిన పాదయాత్రతో చాలా మంది జనం జగన్‌కి దగ్గరయ్యారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే .. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి 60 శాతం ఛాన్స్ ఉండగా టీడీపీకి 40 శాతం అవకాశాలు ఉన్నాయి అంటూ లెక్కలు చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.

చదవండి: బాబు వ్యూహానికి జగన్ ప్రతి వ్యూహం!
- Advertisement -