టీడీపీ నేత అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు

- Advertisement -

అమరావతి: టీడీపీ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

రెండోసారి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనను బుధవారం సాయంత్రం జీజీహెచ్‌ అధికారులు డిశ్చార్జి చేశారు. దీంతో పోలీసులు అచ్చెన్నను వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి, అంబులెన్సులో విజయవాడ సబ్‌జైలుకు తరలించారు.

కాగా, అచ్చెన్నాయుడును ఆస్పత్రికి తరలించే అంశంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ అంశంపై శనివారం తీర్పు ఇవ్వనున్నట్టు హైకోర్టు తెలిపింది.

అచ్చెన్నాయుడుకు రెండోసారి శస్త్రచికిత్స జరిగిందని, చికిత్స తర్వాత పరిస్థితి ఇబ్బందిగా మారిందని అచ్చెన్న తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

అచ్చెన్నకు మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. అచ్చెన్నాయుడుకు పూర్తిస్థాయిలో చికిత్స అందించామని, ఆయనకు మెరుగైన వైద్యం అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.

- Advertisement -