26.3 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ 2019 ఏపీ ఎన్నికలపై ఓ స్వతంత్ర సంస్థ తాజా డీటెయిల్డ్ సర్వే! గెలిచేదెవరంటే..

2019 ఏపీ ఎన్నికలపై ఓ స్వతంత్ర సంస్థ తాజా డీటెయిల్డ్ సర్వే! గెలిచేదెవరంటే..

AP Latest Survey News, AP Latest Political News, AP News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా? లేక ఈసారైనా ముఖ్యమంత్రి కావాలన్న జగన్ కోరిక నెరవేరుతుందా? ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు సీఎం అవుతారో తేల్చేందుకు ఒక స్వతంత్ర సంస్థ సర్వే నిర్వహించింది.

ప్రతి జిల్లాలోనూ శాంపిల్స్ తీసుకుని సర్వే నిర్వహించినట్టు ఆ సర్వే నిర్వాహకులు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గాల వారీగా ప్రజల ఓటింగ్ శాతాన్ని కూడా ఈ సర్వే చెబుతోంది.

ఈ డీటెయిల్డ్ సర్వే ప్రకారం.. జిల్లాల వారీగా వివరాలు చూస్తే.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి 6 సీట్లు, టీడీపీకి 3 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ జిల్లాలో జనసేన పాలకొండలో మాత్రమే ముందంజలో ఉంది. విజయనగరం జిల్లాలో వైసీపీకి 8 సీట్లు, టీడీపీకి 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

విశాఖ జిల్లాలో వైసీపీకి 7 సీట్లు, టీడీపీకి 4 సీట్లు.. జనసేనకు 4 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే పవన్ కల్యాణ్ గాజువాకలో గెలుస్తారని ఈ సర్వే చెబుతోంది. ఇక తూర్పు గోదావరి జిల్లాకి వస్తే.. ఈ జిల్లాలో వైసీపీకి 12 సీట్లు, టీడీపీకి 3 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. జనసేనకు కూడా 4 సీట్లు వచ్చే అవకాశం ఉందట.

చదవండి: గెలుస్తామా.. లేదా? టీడీపీ నేతల్లో టెన్షన్! లగడపాటి ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు!?

పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి 9 సీట్లు,  టీడీపీకి 4 సీట్లు వచ్చే అవకాశం ఉంది. జనసేనకు 2 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది. భీమవరంలోనూ పవన్ కల్యాణ్ గెలిచే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో వైసీపీకి 9 సీట్లు, టీడీపీకి 7 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ జిల్లాలో జనసేనకు ఖాతా తెరిచే ఛాన్స్ లేదు.

గుంటూరు జిల్లాలో వైసీపీకి 10 సీట్లు, టీడీపీకి 7 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ జిల్లాలో నారా లోకేశ్‌కు ఓటమి తప్పదని సర్వే అంచనా వేసింది. ప్రకాశం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుంది. మొత్తం 12 నియోజకవర్గాలూ ఆ పార్టీనే గెలుచుకుంటుంది. టీడీపీ, జనసేనలకు ఖాతా తెరిచే ఛాన్సు లేదు.

నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుంది. మొత్తం నియోజకవర్గాలను ఆ పార్టీయే గెలుచుకుంటుందట. ఇక్కడ కూడా టీడీపీ, జనసేనలకు ఖాతా తెరిచే ఛాన్సు లేదని తెలుస్తోంది. పోతే, కర్నూలు జిల్లాలో టీడీపీకి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. మిగిలినవన్నీ వైసీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి.

అనంతపురం జిల్లాలో టీడీపీకి 6 స్థానాలు రాగా.. వైసీపీ 8 స్థానాలు దక్కించుకోబోతోంది. కడప జిల్లాలో ఒక్క జమ్మలమడుగు తప్ప మిగతా అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. జగన్ పులివెందులలో గెలుస్తారు. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. టీడీపీకి 2, వైసీపీకి 12 స్థానాలు దక్కనున్నాయి.

ఇక చంద్రబాబు కుప్పంలో గెలుస్తారు. ఓవరాల్‌గా చూసుకుంటే.. తెలుగుదేశానికి 44 స్థానాలు, వైసీపీకి 124 స్థానాలు, జనసేనకు 11 స్థానాలు దక్కనున్నాయి. మొత్తం మీద జగన్‌ సీఎం కావడం తథ్యం అని ఈ సర్వే చెబుతోంది.

చదవండి: జగన్ సొంత సర్వేలో ఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి!
- Advertisement -