దక్షిణాది దిగ్గజ నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత

- Advertisement -

బెంగళూరు: దిగ్గజ నటుడు, దర్శకుడు గిరీశ్ కర్నాడ్(81) ఈ ఉదయం 6:30 గంటలకు బెంగళూరులో కన్నుమూశారు. గిరీష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించి ఈ ఉదయం 6.30 గంటల సమయంలో మృతిచెందారు.

గిరీష్ కర్నాడ్ 19 మే 1938లో మహారాష్ట్రలోని మాథేరాన్ ప్రాంతంలో జన్మించారు. కన్నడలో పలు నాటకాలు రచించిన ఆయన…1970లో ‘సంస్కారా’ అనే చిత్రం ద్వారా ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత కన్నడ, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో ఆయన నటించారు.

గిరీష్ కు 1998లో జ్ఞానపీఠ్ అవార్డుతో పాటు 1974లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్ అవార్డులు వచ్చాయి. సినిమాలకు సంబంధించి ఆయన ఏడు ఫిలింఫేర్ అవార్డులు, 10 జాతీయ అవార్డులు అందుకున్నారు. తెలుగులో గిరీశ్ కర్నాడ్ ధర్మచక్రం, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, ప్రేమికుడు, ఆనంద భైరవి, రక్షకుడు తదితర చిత్రాల్లో నటించారు . చివరిగా ఆయన సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జిందా హై’ చిత్రంలో రా చీఫ్ గా నటించారు.

చదవండి: ఎవరికీ తెలియని తాత కోరికని బయటపెడుతూ చైతూ ఎమోషనల్ పోస్ట్!

 

- Advertisement -