26.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు అతిలోక సుందరి మళ్లీ కనిపిస్తే? ఇదిగో రూపంలో అచ్చు శ్రీదేవి.. శారీ మోడల్ రూప్సా…

అతిలోక సుందరి మళ్లీ కనిపిస్తే? ఇదిగో రూపంలో అచ్చు శ్రీదేవి.. శారీ మోడల్ రూప్సా…

- Advertisement -

saree-lover-model-rupsa-chowdary

కోల్‌కతా: అతిలోక సుందరి శ్రీదేవి మరణవార్త ఎంతోమందిని తీవ్ర వేదనకు గురిచేసింది. ఎందుకంటే.. ఎంతోమంది కలల రాణి శ్రీదేవి. అలాంటి శ్రీదేవిని మళ్లీ చూడగలిగితే? ఈ ఊహే అందరినీ ఊపేస్తోంది కదూ! అయితే మీరు రూప్సా సహ చౌధురిని చూసి తీరాల్సిందే. ఎందుకంటే, ఈమెను చూడగానే మరో శ్రీదేవిని చూసినట్లు అనిపిస్తుంది.

అవును, కాస్త బొద్దుగా ఉన్నా.. ఈమె రూపం అచ్చు.. శ్రీదేవిని తలపిస్తోంది. ఇటీవల రూప్సా పేరు సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తోంది. శ్రీదేవిని అమితంగా అభిమానించే కుర్రకారుకు తాజాగా అలాంటి పోలికలు ఉన్న రూప్సా సహ చౌధురి ‘కలల రాణి’గా మారింది. కావాలంటే మీరే చూడండి..

‘యూట్యూబ్’లో కొత్త అందాలు వెతికే కుర్రకారుకు రూప్సా సహ చౌధురి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2018లో అత్యధిక నెటిజన్లు ఈమె గురించి తెగ వెతికేశారట. దీనికి కారణం.. ఓ ‘యూట్యూబ్’ వీడియోనే. ‘రెడ్ హార్ట్ ఎంటర్‌టైన్మెంట్’ అనే ఓ యూట్యూబ్ ఛానెల్. చీర కట్టులోని సెక్సీతనాన్ని చూపిస్తూ.. కొంతమంది మోడళ్ల వీడియోలను రూపొందించింది.

ఇందులో భాగంగా రూప్సా సహ చౌధురి వీడియోను కూడా ఆ ఛానల్ విడుదల చేసింది. ఇంకేముంది, ఆ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారిపోయింది. ఇప్పటివరకు ఆ వీడియోను 10 మిలియన్ల మంది వీక్షించారు.

ఎర్ర చీరలో తన బరువైన అందాలను ఆరబోస్తూ సిగ్గు ఒలకబోసే ఈ వీడియో ఎంతోమందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రకారు.. రూప్సా సహ చౌధురి అందాలకు ఫ్లాట్ అయిపోతున్నారు. ఇక అప్పట్నించి ఇంటర్నెట్ రూప్సా పేరుతో ఇంటర్నెట్‌లో ఆమె ఫొటోలు, వీడియోలను తెగ వెతికేస్తున్నారు. ఆమె కేవలం మోడల్ మాత్రమేనా? సినిమా హీరోయిన్ కూడానా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన రూప్సా సహ చౌధురి(24) సినిమా హీరోయిన్ కాదుగానీ, ఆమె ఒక శారీ మోడల్. వివిధ వస్త్ర దుకాణాలు, ప్రకటనలకు ఆమె మోడల్‌గా వ్యవహరించారు. శారీ మోడల్‌గా అందాల ఆరబోత ప్రారంభించిన తరువాత క్రమంగా ఆమెకు అభిమానులు పెరుగుతూ వచ్చారు.

బెంగాలీ యువత ఆమెను ముద్దుగా ‘బాంగ్ క్రష్’ అని పిలుచుకుంటారు. రూప్సా 2018లో ‘నా’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ సాంగ్స్, శారీ మోడల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఏది ఏమైనా కుర్రకారు కలలరాణి శ్రీదేవి పోలికలు ఆమెకు ఉండడం కూడా కొంత కలిసొచ్చిందనే చెప్పాలి.

 

- Advertisement -