22.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు మే 31న సూర్య ‘ఎన్.జి.కె.’ సినిమా విడుదల, తెలుగు రైట్స్ ఎవరికి దక్కాయో తెలుసా?

మే 31న సూర్య ‘ఎన్.జి.కె.’ సినిమా విడుదల, తెలుగు రైట్స్ ఎవరికి దక్కాయో తెలుసా?

ngk-movie-surya
- Advertisement -

హైదరాబాద్: ‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సూర్య.. ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘ఎన్‌.జి.కె.(నంద గోపాలకృష్ణ)’.

ఈ చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కాగా, ఈ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ సొంతం చేసుకున్నారు. మే 31న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సూర్య సరసన సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., ఆర్ట్‌: ఆర్‌.కె.విజయ్‌ మురుగన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, దర్శకత్వం: శ్రీరాఘవ.

- Advertisement -