వెబ్‌సైట్‌లో టీఎస్సీఎస్సీ గ్రూప్ 4.. ఇతర పరీక్షల హాల్ టికెట్లు.. పరీక్షలు ఎప్పుడంటే…

tspsc-logo
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్- 4, ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్, బిల్  కలెక్టర్(జీ.హెచ్‌.ఎం.సీ) బేవరేజెస్ కార్పొరేషన్‌లో పోస్టుల రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. హాల్‌ టికెట్లును ‘టీఎస్‌పీఎస్సీ’ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అభ్యర్ధులు టీఎస్‌పీఎస్సీ ఐడీతో పాటు పుట్టిన తేది, వివరాలను నమోదు చేసి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అభ్యర్ధులు వేర్వేరుగా దరఖాస్తులు తీసుకున్నప్పటికీ… పరీక్ష మాత్రం ఉమ్మడిగానే నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.

హాల్ టికెట్ల డౌన్ లోడ్ ఇలా….

తెలంగాణ ప్రభుత్వం గత జూన్‌లో 2786 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో 1521 గ్రూప్ -4 ఉద్యోగాలతో పాటు వీఆర్వో(700), ఏఎస్‌వో(474) ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్(72) పోస్టులు ఉన్నాయి. అయితే… గ్రూప్ -4 పోస్టులకు సంబంధించి  ఇప్పుడు ఉన్న పొస్టులకు అదనంగా మరో 74 పోస్టులను జత చేస్తూ… తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది.

దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1595కి చేరింది. ప్రభుత్వం కొత్తగా కలిపిన పోస్టుల్లో రిజిస్ట్రేషన్ & స్టాంపుల విభాగం నుంచి 44 , షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖలో 30 ఉన్నాయి. గ్రూప్ -4 నోటిఫికేషన్‌కు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులందరూ కూడా ఈ పోస్టులకు అర్హులు.

వీటితోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్‌  (జీహెచ్‌ఎంసీ) పరిధిలో  ఉన్న 124 బిల్ కలెక్టర్ పోస్టులు, బేవరేజెస్ కార్పొరేషన్‌లో 76 పోస్టుల భర్తీ పరీక్షను కూడా గ్రూప్-4తో పాటే కలిపి నిర్వహిస్తారు.

గ్రూప్ -4 సిలబస్, రాత పరీక్ష వివరాలు…

పేపర్ -1 లో జనరల్ నాలెడ్జ్, పేపర్ 2 లో సెక్రటేరియల్ ఎబిలిటీస్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పదో తరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రశ్న పత్రం ఉంటుంది.  పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు.  మొత్తం రెండు పేపర్లకుగాను 300 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు, పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలు.

- Advertisement -