

ప్రకాశం: విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన బాధ్యతగల పదవిలో ఉన్న ఓ పాఠశాల కరస్పాండెంట్ కీచకుడిలా మారాడు. కామంతో కళ్లు మూసుకుపోయి.. మాయమాటలు చెప్పి ఓ పదో తరగతి విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది.
ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాల వద్దకు చేరుకున్నారు. కానీ, అప్పటికే ఆ దుర్మార్గుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఇంకొల్లులోని ఎంఆర్ఆర్ ప్రకాశం హైస్కూల్’లో బాధిత బాలిక పదో తరగతి చదువుతోంది. అక్కడే పాఠశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్ లో ఆమె ఉంటోంది. ఈ నేపథ్యంలో సదరు బాలికపై పాఠశాల కరస్పాండెంట్ వీరయ్య కన్నుపడింది.
మంచి మార్కులు వచ్చేలా చేస్తాననీ, పాస్ చేయిస్తానని మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. అనంతరం పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన బాలిక స్కూలుకు వెళ్లేందుకు ఇష్టపడలేదు.
పరారైన కరస్పాండెంట్…
ఈ క్రమంలో తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో ఏడుస్తూ అసలు విషయం చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన తల్లిదండ్రులు బంధువులను తీసుకుని పాఠశాల వద్దకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వీరయ్య.. అక్కడి నుంచి పరారయ్యాడు.
నిందితుడైన సదరు కరస్పాండెంట్‌పై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరయ్యను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
చదవండి: వీడు మనిషేనా?: ‘‘ఫోన్ చేస్తే మాట్లాడాలి.. పిలిచినప్పుడల్లా వచ్చి నా కోరిక తీర్చాలి.. లేదంటే..’’
చదవండి: దారుణం: కూతురిపై తండ్రి, బాబాయ్‌లే.. మూడేళ్లుగా అదే తంతు.. తెలిసినా మిన్నకుండిపోయిన తల్లి!
చదవండి: దారుణం: ఇంజనీరింగ్ విద్యార్థినిపై అన్నయ్య స్నేహితుడే.. మరో ఐదుగురితో కలిసి రెండ్రోజులపాటు…








