26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home క్రికెట్ హార్దిక్ నా కన్న గొప్ప క్రికెటర్ గా ఎదగాలి : కపిల్ దేవ్

హార్దిక్ నా కన్న గొప్ప క్రికెటర్ గా ఎదగాలి : కపిల్ దేవ్

- Advertisement -

ఆర్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్. ఆల్ రౌండ్ ఇన్నింగ్స్ తో అదరగొట్టి భారత్ కు ఎన్నో అద్భుత విజయాలు అందించిన కపిల్ దేవ్… పాండ్య తనకంటే గొప్పగా రాణించాలని కోరుకున్నాడు.

చదవండి: మెగాస్టార్ చిరు చిన్నల్లుడికి ఆకతాయిల వేధింపులు

ఇప్పటికే బ్యాటింగ్ తో అద్భుతాలు చేసిన పాండ్య… బౌలింగ్ లో మాత్రం ఇంకా రాణించాల్సి ఉందన్నారు. బ్యాటింగ్ లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడని… బౌలింగ్ లో మరింత మెరుగవ్వాలని అభిప్రాయపడ్డాడు.

అయితే హార్దిక్ పాండ్యాను తనతో పోల్చొద్దని సూచించాడు కపిల్. అతని ఆటను అతన్ని ఆడనివ్వాలన్నాడు. అతని టాలెంట్ ఏంటో ఆల్ రెడీ చూశామని… పాండ్య నా కన్నా గొప్ప ఆటగాడిగా ఎదగాలని కోరుకుంటున్నానని చెప్పాడు. పాండ్యకు భారత జట్టు సపోర్టింగ్ గా ఉందన్నాడు.

ఇక 2016లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన హార్దిక్ పాండ్యా.. ఎన్నో మెస్మరైజింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్ , బౌలింగ్ లో మరింత రాటుదేలుతూ… ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు.

- Advertisement -