22.7 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home క్రికెట్ ఒక రీప్లేలో అలా.. మరో దాంట్లో ఇలా: ధోనీ రనౌట్ నిర్ణయంపై అభిమానుల ఆగ్రహం!

ఒక రీప్లేలో అలా.. మరో దాంట్లో ఇలా: ధోనీ రనౌట్ నిర్ణయంపై అభిమానుల ఆగ్రహం!

MS Dhoni Latest News, IPL Latest News, Cricket Updates News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదిగా ముంబై ఇండియన్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రనౌట్‌పై వివాదం పెరిగిపోతుంది.

ధోనీ రనౌట్ కాలేదని, బంతి వికెట్లకి తాకే క్షణంలోనే అతడు తన బ్యాట్‌ని క్రీజులో ఉంచాడని ధోని అభిమానులు వాదిస్తున్నారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాట్స్‌మెన్‌కి అనుకూలంగా నిర్ణయం ఇచ్చి ఉండాలని అంటున్నారు.

ధోనీ రనౌట్‌తో సీఎస్‌కేపై పెరిగిన ఒత్తిడి…

మ్యాచ్‌ కీలక సమయంలో ధోనీ రనౌటవడంతో ఒత్తిడికి గురైన సీఎస్‌కే బ్యాట్స్‌మెన్ ఆఖరికి ఒక్క పరుగు తేడాతో ఓడి టైటిల్‌ను చేజార్చుకుంది. 150 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై జట్టు 12.3 ఓవర్లు ముగిసే సమయానికి 81/3 నిలిచింది. ఈ దశలో క్రీజులో ఉన్న చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ బంతిని ఫైన్ లెగ్ దిశగా నెట్టి సింగిల్ తీశాడు.

అయితే, అక్కడున్న మలింగ బంతిని హార్దిక్ పాండ్యాకి విసరగా దాన్ని అతడు అందుకోలేకపోయాడు. బంతి ఎక్స్‌ట్రా కవర్‌వైపు దూసుకెళ్లింది. బంతిని బౌలర్‌ మిస్ చేయడంతో రెండో పరుగు కోసం వాట్సన్‌ను ధోనీనే స్వయంగా పిలిచాడు.

దీంతో వాట్సన్ స్పందించి వేగంగా పరుగెత్తగా ధోనీ కూడా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరుగెత్తాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న ఇషాన్ కిషన్ నేరుగా వికెట్లపైకి బంతిని విసిరేశాడు. దీంతో ధోని రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఒక రీప్లేలో బ్యాట్ క్రీజులో ఉన్నట్లు, మరో కెమెరా విజువల్స్‌లో బంతి క్రీజు ఆవల ఉన్నట్లు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ ధోనీని రనౌట్‌గా ప్రకటించాడు.

- Advertisement -