33.1 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home క్రికెట్ ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్

ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్

aus vs pak
- Advertisement -

టాంటన్‌: ప్రపంచ కప్‌లో మరో సంచలన విజయం సాధించే అవకాశాన్ని పాకిస్తాన్‌ కొద్దిలో మిస్ అయ్యింది. తొలుత బౌలింగ్‌లో పుంజుకుని ప్రత్యర్థిని కట్టడి చేసిన ఆ జట్టు, బ్యాటింగ్‌లో మంచి స్థితిలో ఉండీ గెలుపును చేజార్చుకుంది. దీంతో ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (111 బంతుల్లో 107; 11 ఫోర్లు, సిక్స్‌) శతకం బాదడంతో పాటు కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ (84 బంతుల్లో 82; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించడంతో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది.

పేసర్‌ ఆమిర్‌ (5/30) ప్రత్యర్థికి కళ్లెం వేశాడు. ఛేదనలో పాక్‌ 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ 75 , హఫీజ్‌ 46 రాణించినా మిడిలార్డర్‌ వైఫల్యం దెబ్బకొట్టింది. టెయిలెండర్లు హసన్‌ అలీ 32 , వహాబ్‌ రియాజ్‌ 45 మెరుపులకు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ (48 బంతుల్లో 40; ఫోర్‌) అండగా నిలిచి పోరాడినా పేసర్‌ స్టార్క్‌ (2/43) ఒకే ఓవర్లో రియాజ్, ఆమిర్‌ (0)లను ఔట్‌ చేసి ఆసీస్‌ విజయాన్ని ఖాయం చేశాడు.

- Advertisement -