22.8 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మరో మూడు రోజులు కుమ్మేయనున్న వానలు.. అధికారుల హెచ్చరికలు

మరో మూడు రోజులు కుమ్మేయనున్న వానలు.. అధికారుల హెచ్చరికలు

- Advertisement -

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వచ్చే 48 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండంగా మారిన అనంతరం అది ఆంధ్రప్రదేశ్‌వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రానున్న మూడు రోజులు తెలంగాణ, రాయలసీమ, కోస్తాలో వానలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.

మరోవైపు, అల్పపీడనం ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా ముసురుపట్టింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం పడింది. 

అల్పపీడనం ప్రభావంతో నేడు ( బుధవారం) అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. 

- Advertisement -