23.8 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఎస్పీ నా కుటుంబాన్ని వేధిస్తున్నారు: మాజీ మంత్రి అఖిలప్రియ ఆగ్రహం

ఎస్పీ నా కుటుంబాన్ని వేధిస్తున్నారు: మాజీ మంత్రి అఖిలప్రియ ఆగ్రహం

- Advertisement -

హైదరాబాద్:  కర్నూలు ఎస్పీ తమ కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని ఏపీ మాజీ మంత్రి  అఖిలప్రియ ఆరోపించారు. తన భర్త భార్గవ్‌ రామ్‌పై పోలీసులు నమోదు చేసిన కేసులు ముమ్మాటికీ తప్పుడు కేసులేనన్నారు.

ఎస్పీ తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ పోలీసులు తనతో చెప్పిన మాటల ఆడియో టేపులను గవర్నర్‌కు అందించనున్నట్టు తెలిపారు. తన కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే దానికి ఎస్పీనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.

వేధింపులకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు.  అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌ను అరెస్టు చేసేందుకు ఆళ్లగడ్డ పోలీసులు హైదరాబాద్ వచ్చారు.

యూసుఫ్‌గూడలోని అఖిలప్రియ ఇంటికి వెళ్లి ఇంట్లో సోదాలు చేసేందుకు యత్నించారు. దీంతో, సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లో సోదాలు ఎలా చేస్తారని అఖిలప్రియ వారితో వాగ్వివాదానికి దిగి అడ్డుకున్నారు.  

- Advertisement -