31.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home క్రికెట్  వరల్డ్ కప్: తొలి మ్యాచ్‌లో సఫారీలని చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్….

 వరల్డ్ కప్: తొలి మ్యాచ్‌లో సఫారీలని చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్….

- Advertisement -

లండన్: ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు అదరగొట్టింది. లండన్ వేదికగా గురువారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 311 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్ (79 బంతుల్లో 89; 9 ఫోర్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), జాసన్ రాయ్ (54; 8 ఫోర్లు), రూట్ (51; 5 ఫోర్లు) అర్ధశతకాలతో జట్టుకు భారీ స్కోరు అందించారు.

ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగ్డీ 3, ఇమ్రాన్ తాహిర్, రబాడ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 312 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీ జట్టు… 39.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటై ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది.

ఓపెనర్ డికాక్ (74 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్లో డసన్ (61 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరు పెద్దగా రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ (3/27), స్టోక్స్ (2/12), ప్లంకెట్ (2/37) రాణించారు. ఇక బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో విజృంభించిన బెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

వరల్డ్ కప్‌లో భాగంగా ఈరోజు పాకిస్తాన్-వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

చదవండి:  భారత్ ప్రపంచకప్ గెలవడంలో అతడు కీలకం అవుతాడు….
- Advertisement -