22.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ భారీ మెజారిటీతో గెలిచిన జగన్.. నగరిలో రోజా విజయకేతనం

భారీ మెజారిటీతో గెలిచిన జగన్.. నగరిలో రోజా విజయకేతనం

YS Jagan News, AP Political news, AP Election Result News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. తన సమీప టీడీపీ అభ్యర్హ్ది సతీశ్ రెడ్డిపై 90,543 ఓట్ల మెజార్టీతో జగన్ విజయ ఢంకా మోగించారు.

అయితే గతంలో కంటే జగన్ సాధించిన మెజార్టీ ఈసారి భారీగా పెరిగింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి 29,903 ఓట్ల మెజారిటీతో సమీప వైసీపీ అభ్యర్ది చంద్రమౌళి పై విజయం సాధించారు.

నగరిలో రోజా గెలుపు…

ఇక చిత్తూరు జిల్లా నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా విజయకేతనం ఎగరవేశారు. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై 2 వేల 681 ఓట్ల మెజార్టీతో ఈ విజయం సొంతం చేసుకున్నారు. ఇదే జిల్లాలోని పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చిత్తూరులో శ్రీనివాసులు కూడా గెలుపొందారు. శ్రీకాకుళం, విజయనగరానికి చెందిన వైసీపీ ఎంపీ అభ్యర్థులూ విజయ బావుటా ఎగరవేశారు.

మొత్తం ఫలితాలని ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం వైసీపీ 97 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 53 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే టీడీపీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా….5 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.

చదవండి: ఆధిక్యం నుంచి.. విజయం దిశగా, అన్ని జిల్లాల్లోనూ దుమ్మురేపుతోన్న వైసీపీ…
- Advertisement -