22.7 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీలోకి జంప్ కొట్టేందుకు చూస్తున్న ఇద్దరు మంత్రులు….?

వైసీపీలోకి జంప్ కొట్టేందుకు చూస్తున్న ఇద్దరు మంత్రులు….?

- Advertisement -

అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఎక్కువ శాతం సర్వేలు వైసీపీనే అధికారంలోకి వస్తాయని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. మే 23న  వెలువడే ఫలితాల్లో మెజారిటీ సీట్లు వైసీపీ దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ప్రచారం కూడా జరుగుతుంది. అలాగే ఈ మ‌ధ్య చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌లని చూస్తుంటే….ఆయనకి ఓటమి భయం పట్టుకుందని అర్ధ‌మ‌వుతోంది.

ఈ క్రమంలోనే ఇంకా టీడీపీలోనే కొనసాగితే ఉంటే త‌మ రాజ‌కీయ‌ భ‌విష‌త్తుకి ప్ర‌మాదం వ‌చ్చే అవ‌కాశం ఉందనే భావిస్తున్న ఇద్దరు మంత్రులు వైసీపీలోకి జంప్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం.

ఆ జంప్ చేసే ఇద్దరు మంత్రుల్లో ఉత్త‌రాదికి చెందిన ఒక మంత్రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన మరో మంత్రి ఉన్నారని తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఈ ఇద్ద‌రు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ని సమాచారం.

అయితే ఈ ఇద్ద‌రు నేత‌లు ఎన్నిక‌ల ముందే వైసీపీలో చేరడానికి చూసారంటా…కానీ అటు వెళితే టికెట్ దక్కడం కష్టమని తెలియడంతో టీడీపీలో ఉండే పోటీ చేశారని చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎన్నిక‌ల ఫ‌లితాలు టీడీపీకి అనుకూలంగా రావని తెలియడంతో…వారు తట్టా బుట్టా సర్దుకుని వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారట. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాలంటే మే 23 వరకు ఎదురు చూడాల్సిందే.

చదవండి: ఊడిపోయే పదవి, ఇంకా దండుకోవాలనే: మరోసారి బాబుపై జీవీఎల్ సెటైర్లు…

- Advertisement -