23.7 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుపై.. పీకే సంచలన ట్విట్!

చంద్రబాబుపై.. పీకే సంచలన ట్విట్!

pk comments to Chandrababu, AP Political Latest News, Newsxpressonline
- Advertisement -

ఢిల్లీ: ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పలు బహిరంగ సభల్లో వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే)ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే బాబు వ్యాఖ్యలపై పీకే ఫస్ట్ టైమ్ ట్విట్టర్ వేదికగా స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పీకే ట్వీట్ సారాంశం..”మహామహా నాయకులే ఒక్క ఓటమితో తుడిచిపెట్టుకుపోయారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. చంద్రబాబు వాడుతున్న భాష, అంటున్న మాటలు బీహార్‌ మీద ఆయనకు ఎంత ద్వేషం, చిన్న చూపు ఉందో తెలుస్తోంది.

నన్ను తిట్టేముందు…ఏపీ ప్రజలు మీకు మళ్లీ ఎందుకు ఓటేయాలో చెప్పండి” అని ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుపై పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పీకే ట్వీట్‌‌పై చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి.

- Advertisement -