25.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ‘‘ఏపీలో అవినీతి పెరిగింది, చంద్రబాబుపై కేసు పెడతా, కేసీఆర్ నా వల్లే సీఎం అయ్యారు..’’

‘‘ఏపీలో అవినీతి పెరిగింది, చంద్రబాబుపై కేసు పెడతా, కేసీఆర్ నా వల్లే సీఎం అయ్యారు..’’

swami svarupandrenda swami
- Advertisement -

swami svarupandrenda swami

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు ముందు కేసీఆర్ రాజశ్యామల యాగం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ యాగం చేసింది లోక కల్యాణం కోసమని చెబుతారు. ఏదేమైనా ఆయన మళ్లీ సీఎం కావడంలో ఈ యాగం ప్రభావం కూడా ఉందని చాలామంది నమ్ముతుంటారు. యాగాలపై ఉన్న నమ్మకం అలాంటిది మరి.

కానీ ఇప్పుడు ఓ స్వామీజీ చంద్రబాబు పదవి పోయేందుకు యాగం చేస్తారట. ఇంతకీ ఆ స్వామీజీకి ఏపీ సీఎం చంద్రబాబుపై అంత కోపం ఎందుకంటారా..?  ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి ప్రస్తుతం తారస్థాయికి చేరిందట. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలన కూడా లోపభూయిష్టంగా మారిందట. ఈ ఆరోపణలన్నీ ఎవరివో తెలుసా? విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివి.

‘‘ఏపీలో ప్రభుత్వ మార్పుకు యాగం చేస్తా…’’

అంతేకాదు, ఇంకా ఆయన పలు విషయాలపై కూడా మండిపడ్డారు. ఉదాహరణకు.. ఆలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయట. వాటికి సంబంధించిన ప్రతి ఆధారం ఆయన వద్ద ఉందట. త్వరలో వాటిని మీడియా ముందు పెడతారట. అంతేకాదు, టీటీడీ అధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపైన కేసు కూడా పెడతారట ఈ స్వామీజీ .

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మార్పు కోసం త్వరలో రాజశ్యామల యాగం కూడా చేస్తానని కుండబద్దలు కొడుతున్నారీ స్వామీజీ . అంతేకాదు,  తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలోకి రావడానికి కారణం తాను దగ్గర ఉండి నిర్వహించిన రాజశ్యామల యాగమే కారణమట . మరి ఎందుకైనా మంచిది చంద్రబాబు దీనికి విరుగుడు ఆలోచించుకోవాలేమో .

గుంటూరులోని గోరంట్లలో ఉన్న శ్రీ పద్మావతి అండాళ్ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి రిలిజియన్ సొసైటీ దేవస్థానంలో జరుగుతున్న సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న స్వామి ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తారస్థాయికి చేరుకుందని ఆరోపించారు. ప్రభుత్వ మార్పు కోసం త్వరలోనే ఏపీలో రాజశ్యామల యాగం చేస్తానని స్వరూపానందేంద్ర స్వామి ఉద్ఘాటించారు.

- Advertisement -