26.3 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ కడపలో టీడీపీకి భారీ షాక్! వైసీపీలో జాయిన్ కాబోతున్న మాజీమంత్రి!

కడపలో టీడీపీకి భారీ షాక్! వైసీపీలో జాయిన్ కాబోతున్న మాజీమంత్రి!

jalilbhasha joining to the ysrcp
- Advertisement -

jalilbhasha joining to the ysrcp

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్దిరోజుల్లోనే 2019 సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటువంటి సమయంలో రాష్ట్రంలో వలసల రాజకీయం మొదలైంది. వచ్చే ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని, అధికారం కోసం నేతలు పార్టీలు మారడానికి తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు.అలాగే ,మాజీ కీలక నేతలు, మంత్రులకి పార్టీలు పదువులని ఆశ చూపి పార్టీలోకి రావాలంటూ మంతనాలు జరుపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీలో ఇప్పటికే వలసల రాజకీయం భీకరంగా జరుగుతుంది. పార్టీలోని కొందరి కీలకనేతలు అండదండలతో పార్టీలు మారాలని చూస్తున్న నేతలకి వలవేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇకపోతే వచ్చే ఎన్నికలలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని అటు టీడీపీ, ఇటు వైసీపీ, మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన గట్టి పట్టుదలతో ముందుకుపోతున్నాయి .

వైసీపీ కంచుకోటలో టీడీపీకి మరో షాక్..

దీనితో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పేలాలేదు . దీనితో అన్ని పార్టీలు కూడా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాయి. ఇప్పటికే కొందరు నేతలు పార్టీలు మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపొతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ కంచుకోట అయిన కడప లో టీడీపీ జెండా ఎగురవేయాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇటువంటి సమయం లో కడపలో టీడీపీ కి భారీ షాక్ తగిలింది.

tdp

కడప టీడీపీలో కీలక నేతగా ఉన్న జలీల్ భాష టీడీపీ కి గుడ్ బై చెప్పి , వైసీపీ లో చేరబోతున్నాడు. ఈ సాయంత్రం హైదరాబాదులోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ తో ఆయన భేటీ కానున్నారు. వైసీసీ ఎమ్మెల్యే అంజాద్ బాషాతో కలసి ఆయన హైదరాబాదుకు బయల్దేరారు. కడపలో 7వ తేదీన జరగనున్న శంఖారావం సభలో ఆయన అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

మరోవైపు, టీడీపీలో తనకు తగినంత గుర్తింపు ఇవ్వడం లేదని ఖలీల్ బాషా గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, పార్టీ మారాలనే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఏది ఏమైనా కూడా కడప లో టీడీపీ జెండా ఎగురవేయాలని చూస్తున్న టీడీపీ అధిష్టానానికి మింగుడుపడడంలేదు.

సంబంధిత వార్తలు : జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి

చంద్రబాబుతో భేటీ: త్వరలో టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి!, కేఈ ఆసంతృప్తి

వైసీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేశ్: వ్యతిరేకిస్తున్న పర్చూరు నేతలు

- Advertisement -