22.8 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల: తేదీలివే…

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల: తేదీలివే…

ganta srinivasa rao
- Advertisement -

ganta-srinivasa-rao-entrance-examinations-1

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ శనివారం విడుదల చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో గంటా మాట్లాడుతూ.. 2019 ఏప్రిల్ 19న అనంతపురం జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ నిర్వహిస్తామని తెలిపారు.

అలాగే ఏప్రిల్‌ 20 నుంచి 22 వరకు- ఎంసెట్‌(ఇంజినీరింగ్‌, ఏప్రిల్‌ 24-ఎంసెట్‌(అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 26-ఐసెట్‌, మే 1 నుంచి 4 వరకు – పీజీ ఈసెట్‌,
మే 6- ఎడ్‌సెట్‌, లాసెట్‌, మే 8 నుంచి 15 వరకు – పీఈసెట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఏయే వర్సిటీలు నిర్వహిస్తున్నాయంటే..

ఏపీ ఎంసెట్(కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో), ఐసెట్(ఎస్వీయూ ఆధ్వర్యంలో), మే 1 నుంచి ఏపీ పీజీసెట్ (ఏయూ ఆధ్వర్యంలో), ఏపీ ఎడ్‌సెట్‌(ఎస్వీయూ ఆధ్వర్యంలో), ఏపీ లా సెట్(ఎస్కేయూ ఆధ్వర్యంలో), ఏపీ పీఈ సెట్ (నాగార్జున యూనివర్శిటీ ఆధ్వర్యంలో) నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తామని మంత్రి అన్నారు.

 

 

- Advertisement -