ఆసక్తికరం: అమెరికాలో ‘తెలుగు తేజం’! 5 పెద్ద నగరాల్లో సగం మంది మన తెలుగు వాళ్లే!!

usa-india-flags
- Advertisement -

liberty-statue

వాషింగ్టన్: అమెరికాలో మన తెలుగు వాళ్లు దూసుకుపోతున్నారు. అంతేకాదు, అమెరికాలో అతి వేగంగా విస్తరిస్తున్న భాష కూడా తెలుగే. మన తెలుగు రాష్ట్ఱాల నుంచి ఎంతోమంది యువతీయువకులు చదువు, ఉపాధి నిమిత్తం అమెరికా వెళుతున్నారు. ఫలితంగా.. ప్రపంచంలోని ఇతర దేశాల వారితో పోల్చుకుంటే అమెరికాలో మన తెలుగువారి అధిపత్యమే శరవేగంగా పెరుగుతోంది.

ఐదు పెద్ద నగరాల్లో సగం మంది…

అమెరికాలోని అయిదు పెద్ద నగరాల్లో విదేశీ భాషలు మాట్లాడే వారి సంఖ్య దాదాపు సగం వరకు ఉంది. మొత్తంగా చూస్తే అమెరికాలో 21.8 శాతం మంది విదేశీ భాషలు మాట్లాడుతున్నారు. చైనీస్ మాట్లాడేవారు 6,53,000 మంది, అరబిక్ మాట్లాడేవారు 3,63,000, హిందీ మాట్లాడే వారు 2,54,000, తెలుగు మాట్లాడేవారు 1,92,000, టగలోగ్ మాట్లాడే వారి సంఖ్య 1,73,000, హైటియన్ క్రియోల్ మాట్లాడే వారి సంఖ్య 1,40,000, బెంగాలీ మాట్లాడే వారి సంఖ్య 1,28,000, ఉర్దు మాట్లాడే వారి సంఖ్య 1,18,000, వియత్నామీస్ మాట్లాడేవారి సంఖ్య 1,17,000 కు పెరిగింది.

హైదరాబాద్ నుంచే అత్యధికులు…

అమెరికాకు వెళ్లే తెలుగు వారిలో మన హైదరాబాదీయుల సంఖ్యే అధికంగా ఉంటోంది. 2015లో అమెరికా కాన్సులేట్ జారీ చేసిన వీసాల లెక్కలు చూస్తే.. అత్యధిక వీసాలు హైదరాబాదీయులే దక్కించుకున్నారు. మన దేశంలో ఏ ఇతర ప్రాంతాల వారికి ఇన్ని వీసాలు దక్కలేదంటే అది అతిశయోక్తి కాదు.

2010-17 మధ్య 86 శాతం మంది…

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఏడేళ్లలో అమెరికాలో మన తెలుగు వారి సంఖ్య 86 శాతం పెరిగింది. అవును, ఈ విషయాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక కథనం కూడా ప్రచురించింది. 2010-17 మధ్య
అంతేకాదు, అమెరికాలో మాట్లాడే భాషల గురించి సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్(సీఐఎస్) చేసిన సర్వేలో కూడా.. అమెరికాలో తెలుగు భాష శరవేగంగా పెరుగుతున్నట్లు తేలింది.

శరవేగంగా విస్తరిస్తోన్న ‘తెలుగు’…

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అమెరికాలో నివసిస్తున్న దాదాపు సగం మంది తమ ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడటం లేదు. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ ఇళ్లలో విదేశీ భాషనే మాట్లాడుతున్నారు. 2010-17 మధ్య తెలుగు మాట్లాడే వారి సంఖ్య అమెరికాలో అనూహ్యంగా పెరిగింది.

ఇతర భాషలు కూడా…

తెలుగు తరువాత అరబిక్, హిందీ, ఉర్దూ, గుజరాతీ భాషలు మాట్లాడే వారు అమెరికాలో ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ తెలుగు మాట్లాడే వారు దాదాపు 4 లక్షల మంది ఉండగా, ఇక అరబిక్ మాట్లాడే వారు 42 శాతం, హిందీ మాట్లాడే వారు 42 శాతం, ఉర్దూ మాట్లాడే వారు 30 శాతం, చైనీస్ మాట్లాడే వారు 23 శాతం, గుజరాతీ భాష మాట్లాడే వారు 22 శాతం పెరిగారు.

అలాగే అమెరికాలో బెంగాలీ మాట్లాడేవారు 3,50,000 మంది ఉండగా, తమిళం మాట్లాడేవారు 2,80,000 మంది ఉన్నారట. వీరి సంఖ్య కూడా వేగంగానే పెరుగుతోంది. బెంగాలీ మాట్లాడే వారు 57 శాతం పెరగగా, తమిళం మాట్లాడే వారు 55 శాతం వరకు పెరిగారు.

ప్రముఖుల్లో మన తెలుగువారు ఎందరో…

భారతదేశం నుంచి ఇంజినీరింగ్ విద్యాభ్యాసం కోసం అత్యధిక శాతం విద్యార్థులు హైదరాబాద్ నుంచే అమెరికా వెళుతున్నారు. 2008-12 మధ్య 26 వేల మంది విద్యార్థులు ఇలా అమెరికా బాటపట్టారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతన్ నారాయణ మన తెలుగువారే. 2013లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన నైనా దేవులూరి మిస్ అమెరికా కిరీటం దక్కించుకున్నారు. ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు. వీరు 1980లలోనే అమెరికా వచ్చి స్థిరపడ్డారు. అంతేకాదు, ఇక్కడి మన తెలుగు విద్యార్థులు ఏటా ‘స్పెల్ బీ’ కాంపిటీషన్లోనూ విజేతలుగా నిలుస్తున్నారు.

తప్పని విషాదాలు…

ఇండియన్ ఇమ్మిగ్రేంట్స్‌కు అమెరికా మరో హోమ్ టౌన్‌గా మారుతోంది. భారత దేశం నుంచి ఎన్నోరాష్ట్రాలు, ఎన్నో భాషల వారు అమెరికాకు వెళ్లినప్పటికీ..  ఇప్పటి వరకు అత్యధికంగా వెళ్లింది మాత్రం మన తెలుగు రాష్ట్రాల నుంచే.  విషాదం ఏమిటంటే… అమెరికన్ల ఘాతుకాలకు కూడా బైలయ్యే వారిలో మన తెలుగు వారే ఎక్కువగా ఉంటున్నారు. అమెరికాలో విద్వేష హత్యలు, దోపిడీలకు వీరు బలయ్యారు.

- Advertisement -