కరోనా వైరస్‌తో ప్ర‌జా గాయ‌కుడు నిసార్ మ‌హమ్మ‌ద్ క‌న్నుమూత

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా వైరస్ ఈ రోజు ప్రజా గాయకుడు, తెలంగాణ నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి నిసార్ మహమ్మద్‌ను బలితీసుకుంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం మృతి చెందారు. ఆర్టీసీలో కండక్టరుగా, డిపో కంట్రోలర్‌గా పనిచేసిన నిసార్ కొన్ని దశాబ్దాలుగా తన పాటలతో ప్రజా ఉద్యమాలకు ఊపుతెచ్చారు.

కరోనా వైరస్‌పై ఇటీవల ఆయన పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. నిసార్ స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సుద్దాల. ప్ర‌స్తుతం ఆయ‌న తెలంగాణ నాట్య‌మండ‌లి రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి సమాజ శ్రేయస్సు కోసమే ఆయన పాటుపడ్డారు. తెలంగాణ సాధ‌న ఉద్య‌మంలో భాగంగా అనేక ధూంధాం కార్యక్రమాలు నిర్వ‌హించారు.

- Advertisement -