23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుని విజయసాయి వదలట్లేదుగా…బాబుకి ప్రజల సొమ్ము అంటే చులకనా…!

చంద్రబాబుని విజయసాయి వదలట్లేదుగా…బాబుకి ప్రజల సొమ్ము అంటే చులకనా…!

Chandrababu Naidu News, Vijay Sai Reddy News, AP Political News, Newsxpressonlone
- Advertisement -

అమరావతి: మొన్నటివరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం,చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఎన్నికలు అయిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చిన విజయసాయి చంద్రబాబుని వదలట్లేదు.

రోజు ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగే విజయసాయి…ఈరోజు కూడా పలు ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ ఆఫీసుల అద్దె చెల్లింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్ల అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు.

విజయవాడ నక్కల రోడ్డులోని పంచాయతీ రాజ్. గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసుకు ఐదు లక్షల లోపే అద్దె చెల్లించేవారని, కానీ తర్వాత దాన్ని రూ.30 లక్షల అద్దె బిల్డింగులోకి షిఫ్ట్ చేశారని, ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ?” అని ఆయన ప్రశ్నించారు.

ఇక తర్వాత ఆశా సిస్టర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి ఒకే సారి 10 వేలకు పెంచి వైఎస్ జగన్ 50 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని అన్నారు. కానీ గత చంద్రబాబు ప్రభుత్వం ఆశా సోదరీమణులపై అమానుషంగా వ్యవహరించిందని,  అరెస్టులు చేసి హింసలు పెట్టారని  విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.

చదవండి: ఆ ఐదు ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలోకే..!
- Advertisement -