25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి 14 రోజుల రిమాండ్! సెంట్రల్ జైలుకు తరలింపు…

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి 14 రోజుల రిమాండ్! సెంట్రల్ జైలుకు తరలింపు…

kotamreddy-sridhar-reddy_1
- Advertisement -

నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసిన వేదాయపాలెం పోలీసులు ఆయన్ను శనివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.  దీంతో న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.

ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తొలుత జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం అక్కడి నుండి సెంట్రల్ జైలుకు తరలించారు.

పోలీసులే కేసు నమోదు చేసి…

ఈ సందర్భంగా పోలీసులు, ప్రభుత్వ వ్యవహారశైలికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ.. కోటంరెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. అక్రమంగా సర్వేలు చేపడుతున్న వ్యక్తులను వైసీపీ కార్యకర్తలు పట్టుకున్నారని గుర్తు చేశారు.

వీరిని పోలీసులకు అప్పగించగా, వైసీపీ నేతలపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్వేల పేరుతో వైసీపీ నేతల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ కార్యకర్తలు, నేతలను అరెస్ట్ చేయడంపై కోటంరెడ్డి పోలీసులను ప్రశ్నించారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని వేదాయపాలెం పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. దీంతో ప్రస్తుతం నెల్లూరులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే అనుచరులు తమ ఎమ్మెల్యే అరెస్ట్‌కి నిరసనగా ధర్నాకి దిగారు.

చదవండి: టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ… కర్నూల్ లేటెస్ట్ సర్వే! ఎవరికెన్నో చూడండి!
- Advertisement -