
శ్రీకాకుళం: ఏపీలో ఎన్నికల వేల పార్టీ అధినేతలు , పార్టీ అభ్యర్థులు , కీలకనేతలు అందరుకూడా తమ ప్రచారంలో మునిగిపోయారు. ఇందులో భాగంగానే వై ఎస్ విజయమ్మ , వైసీపీ తరుపున ప్రచారంలో పాల్గొంటుంది. ఈ సందర్భాల్లో ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పై మండిపడింది.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ అధినేత తల్లి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి ప్రశ్నించారు. బుధవారం నాడు గజపతినగరంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె బహిరంగ సభలో మాట్లాడుతూ.. కేసిఆర్ మన రాష్ట్రంలో పోటీ చేయడం లేదు కదా.
మరి ఎందుకు ఆయన్ను ఓడించండి అని ఇక్కడ ప్రజలను చంద్రబాబు ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆమె ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకులు ఇసుక, మట్టి, రాజధాని, విశాఖ భూములు ఏవీ వదిలి పెట్టడం లేదని విజయలక్ష్మి ఆరోపించారు.
నా చుట్టూ ఉండండి., నాకు అనుభవం ఉందని చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఆరువందలు హామీలు ఇచ్చారు. ఒక్కటైనా మవనెరవేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందీస్తే చంద్రబాబు వాళ్ల కార్యకర్తల సంక్షేమం తప్ప మరేదీ చూడలేదు. తమ్ముళ్ల నన్ను రక్షించండి. నా చట్టు ఉండండి, నా భద్రత మీ భద్రత అంటున్నాడు అని విజయలక్ష్మి స్పష్టం చేశారు.








